ఆ తర్వాత కొద్ది రోజులకు మంచు విష్ణు ఆ వివాదాలపై స్పందిస్తూ అదంతా నిజం కాదని, రియాలిటీ షోలో భాగమని విష్ణు ఆ మధ్య క్లారిటీ ఇచ్చాడు.హౌస్ ఆఫ్ మంచూస్ పేరుతో త్వరలో ఒక పెద్ద రియాలిటీ షోను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు ప్రకటించాడు. అయితే మంచు విష్ణు ఈ విషయాన్ని ప్రకటించి దాదాపు 5 నెలలు కావస్తున్నా కూడా ఇప్పటివరకు ఆ షో కి సంబంధించి ఎటువంటి అప్డేట్ కానీ వార్తలు కానీ లేవు. ఇది ఇలా ఉంటే తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న మంచు విష్ణు భాగంగా మాట్లాడుతూ అనేక విషయాల గురించి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హౌస్ ఆఫ్ మంచూస్ రియాలిటీ షో త్వరలో ఉండబోతోంది.
ప్రపంచంలోనే అతిపెద్ద ఓటీటీ ప్లాట్‌ఫామ్‌తో చర్చలు జరుగుతున్నాయి. అది ఎలా రాబోతుందనేది ఆతృతతో ఎదురుచూస్తున్నాం. మనోజ్‌తో గొడవ నిజమా? కాదా?అని అడుగుతున్నారు. ఏడెనిమిది నెలల్లో మీకే తెలుస్తుంది అని చెప్పుకొచ్చాడు. ఆస్తులు పంచుకున్నారా? అన్న యాంకర్ ప్రశ్నించగా ఆ విషయంపై మంచు విష్ణు స్పందిస్తూ..అంత అవసరమేంటి? నేను ఉమ్మడి కుటుంబాన్ని నమ్ముతాను. కానీ ఆ కుటుంబం అలాగే కలిసి ఉండాలని చెప్పను. భార్యాపిల్లలతో రెస్టారెంట్‌కు, సినిమాకు ఎక్కడికి వెళ్లినా నాన్నగారికి చెప్పే వెళ్తాను.అలా ఉంటేనే నాకిష్టం. అలాగే సినిమా షూటింగ్‌లో ఎవరైనా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తే నాకు అస్సలు నచ్చదు. పెద్దలు, మహిళలకు గౌరవం ఇవ్వనివాళ్లతో నేను క్లోజ్‌గా ఉండలేను. అని తెలిపారు మంచు విష్ణు.అనంతరం తన సినిమాల గురించి మాట్లాడుతూ.. నా నెక్స్ట్ సినిమా కన్నప్ప భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాము. నేను చాలా రిస్క్ తీసుకుంటున్నాను. ఈ సెప్టెంబర్ నుంచి కన్నప్ప షూటింగ్ ప్రారంభం కానుంది అని చెప్పుకొచ్చారు.