డబ్బులు ఎవరికి ఊరికే రావు అనే ఒక్క డైలాగ్ తో ఎంతో ఫేమస్ అయ్యారు లలిత జ్యువెలరీ ఎండి కిరణ్ కుమార్. ఈయన గోల్డ్ జ్యువెలరీ సంస్థ లను నెలకొల్పి ఇప్పటి వరకు మన రెండు తెలుగు రాష్ట్రాల లో సుమారు 50 షో రూమ్ల ను ప్రారంభించి బిజినెస్ మెన్ గా ఎంతో మంచి గుర్తింపు పొందారు.అయితే తాజా గా కర్నూలు లో తన లలితా జ్యువెలరీ 51వ షోరూం ప్రారంభించారు.ఈ షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమం లో భాగం గా పలువురు రాజకీయ నాయకులు ముఖ్య అతిథులు గా హాజరై ఈ షోరూం ప్రారంభించారు. ఈ క్రమం లోనే ఈయన మీడియా సమావేశం లో మాట్లాడారు.

ఈ సందర్భం గా కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఇది తన 51వ షోరూం అని తెలిపారు. అయితే నా షో రూమ్ లో ఎవరు బంగారం కొనమని నేను ఎప్పుడూ చెప్పనని నా షాప్ కి వచ్చి మీకు నచ్చిన నగ ఫోటో తీసుకొని బయట కంపేర్ చేసి నచ్చితే కొనమని మాత్రమే చెబుతున్నానని ఈయన తెలియ జేశారు.ఇక దేశ వ్యాప్తం గా తన షోరూమ్స్ విస్తరింప చేయాలన్నదే నా లక్ష్యమని ఈ సందర్భం గా కిరణ్ కుమార్ వెల్లడించారు. ఇకపోతే మీరు రాజకీయాల లోకి రాబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి ఎంత వరకు నిజమని ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు కిరణ్ కుమార్ సమాధానం చెబుతూ రాజకీయాల లోకి  రానని, అలాగే సినిమా లలో కి కూడా రానని ఈ సందర్భం గా కిరణ్ కుమార్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ జన్మకు తాను ఈ వ్యాపార రంగంలోనే కొనసాగుతానని ఈ సందర్భంగా ఎండి కిరణ్ కుమార్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: