చాలా చిత్రాలలో హీరోయిన్గా నటించిన లక్ష్మి రాయ్ ఆ తర్వాత పలు చిత్రాలలో స్పెషల్ సాంగులను నటించింది. అలా బలుపు, గబ్బర్ సింగ్, ఖైదీ నెంబర్ 150 తదితర చిత్రాలలో నటించి మంచి క్రేజ్ అందుకుంది. కెరియర్ ప్రారంభం నుంచి గ్లామర్ ను వలకబోస్తూ ఉండే లక్ష్మీరాయ్ ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. సోషల్ మీడియాలో నిత్యం గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ట్రెండీ గా మారుతూ ఉంటుంది. వెండితెర పైన అందాల ఆరబోతతో ఆకట్టుకున్నప్పటికీ ఎఫైర్స్ వల్ల కూడా తరచూ వైరల్ గా మారుతూనే ఉంటుంది లక్ష్మీరాయ్.
అప్పట్లో మాజీ కెప్టెన్ టీమిండియా ప్లేయర్ ధోని తో ఇమే ఎఫైర్ నడిపిందని వార్తలు కూడా వినిపించాయి. తన రిలేషన్షిప్ పై ఒక ఇంటర్వ్యూలో లక్ష్మీరాయ్ మాట్లాడుతూ తనకు ఎఫైర్ రిలేషన్షిప్ లేవని నేను అబద్ధం చెప్పను ఎందుకంటే జీవితమంటే రిలేషన్షిప్ అని నేను కొంతమంది తో డేటింగ్ చేసిన మాట వాస్తవమే అంటూ తెలియజేసింది.. కొన్ని కారణాల చేత విడిపోవడం కూడా జరిగింది అంటూ తెలిపింది. సోషల్ మీడియాలో తాజాగా తన స్నేహితులతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న లక్ష్మీరాయ్ సముద్రపు ఒడ్డున తన అందాలను ఆరబోస్తూ బికినీ ధరించి మరి టూ హాట్ గా కనిపిస్తూ డాన్స్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ గా మారుతున్నాయి.