టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న రష్మిక.. పుష్ప చిత్రంతో ఒక్కసారిగా పాన్ ఇండియా లెవెల్లో మంచి పాపులారిటీ అందుకుంది. దీంతో ఇతర భాషలలో కూడా నటించేందుకు సిద్ధమయ్యింది రష్మిక.. పుష్ప సినిమా తర్వాత ఈమె హీరోయిన్గా నటించిన సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేకపోవడంతో ఒక్కసారిగా ఈమె కెరియర్ డ్రాప్ అయ్యింది.. బాలీవుడ్ లో నటించిన సినిమాలు కూడా ఫెయిల్యూర్ గా మిగిలాయి. ఇక పలు రకాల బ్రాండ్స్ కు అంబాసిడర్ గా కూడా వ్యవహరించడం జరిగింది రష్మిక.. అయితే ఇప్పుడు ఒక్కసారిగా ఈమె క్రాఫ్ పడిపోవడంతో అన్ని చేజారిపోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.



రష్మిక క్రేజ్ తగ్గిపోవడమే కాకుండా సినిమాలలో కూడా పెద్దగా ఆకట్టుకోలేక పోతోంది. అంతేకాకుండా పలు రకాల బ్రాండ్ కు కూడా అంబాసిడర్ గా వ్యవహరించిన రష్మిక ప్లేస్ లో ఇప్పుడు రెండు మూడు ప్రాజెక్టులకు శ్రీలీల సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా సినిమాల విషయంలో రష్మిక స్థానాన్ని శ్రీ లీల సొంతం చేసుకున్నది.. ఒకవైపు సినిమాలతో మరొకవైపు రష్మిక బ్రాండ్లను సైతం శ్రీ లీల కైవసం చేసుకోవడంతో అభిమానుల సైతం కాస్త అసహనానికి గురవుతున్నారు.


రష్మిక తన ఫోకస్ మొత్తం బాలీవుడ్ వైపు పెట్టినట్లుగా తెలుస్తోంది.ప్రస్తుతం ఇమే యానిమల్ అనే ఒక చిత్రంలో నటిస్తోంది. తెలుగులో మాత్రం ఏ ఒక్క సినిమాలో కూడా నటించలేదు. పలు రకాల లేడి ఓరియంటెడ్ చిత్రాలలో కూడా నటిస్తోంది రష్మిక.  శ్రీ లీల క్రేజ్ గురించి చెప్పాల్సిన పని లేదు.. స్టార్ హీరోలతో నటిస్తూనే యంగ్ హీరోలతో కూడా నటిస్తోంది దాదాపుగా ఈ అమ్మడు చేతిలో పదికి పైగా సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాలన్నీ సక్సెస్ అయ్యాయి అంటే శ్రీ లీల క్రేజ్ అమాంతం పెరిగిపోతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా శ్రీ లీల అందానికి డాన్స్ కి సైతం ఫిదా అవుతున్నారు ప్రేక్షకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: