కన్నడ నాట నుంచి సైలెంట్ గా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి సినిమాలు. కెజియఫ్ స్పూర్తిత కాంతార లాంటి సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటాయి.మరీ ముఖ్యంగా గత ఏడాది విడుదలయి... దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది కాంతార సినిమా. దక్షిణ కన్నడ సంస్కృతిలో భాగమైన భూతకోల నేపథ్యాన్ని కథగా తీసుకుని తెరకెక్కిన ఈసినిమా ఆడియన్స్ లో ప్రత్యేక ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేసింది. డివోషనల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన కాంతార మూవీ రిలీజ్ అయిన అన్ని భాషల్లో అద్భుతమైన రెస్పాన్స్ తో పాటు.. అదిరిపోయే కలెక్షన్స్ ను కూడా సాధించింది.

దాదాపు 400 కోట్లకు పైగా కలెక్షన్స్ నుసాధించింది కాంతారా మూవీ. ఇక ఈసినిమాకు సెకండ్ పార్ట్ మూవీని కూడా తెరకెక్కిచడానికి రెడీ అయ్యారు హీరో,డైరెక్టర్ రిషబ్ శెట్టి. కాంతార సినిమాకు ప్రీక్వెల్ మూవీని తెరకెక్కించబోతున్నారు. కాంతార సినిమాకు ముందు జరిగిన భాగాన్ని ఈసినిమాలో చూపించబోతున్నారు మేకర్స్. అయితే ఈసినిమా షూటింగ్ కు అన్ని ఏర్పాట్లు జరిగినట్టు తెలుస్తోంది. అయితే ముందుగా ఈమూవీ షూటింగ్ ను ఆగస్ట్‌ చివరి వారంలో మొదలు పెడతాం అనుకున్నారు. కాని ఇప్పుడు ఈషూటింగ్ ను పోస్ట్ పోన్ చేసినట్టు తెలుస్తోంది. మొదలుకానుందని సమాచారం.

కాంతారా కి సీక్వెల్ గా కాకుండా ప్రీక్వెల్ గా ఉంటుంది అని కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే. మేకర్స్ కాంతారా ప్రీక్వెల్ మూవీ షూటింగ్ ని ఈ ఏడాది నవంబర్ లో ప్లాన్ చేస్తున్నారట. ఫస్ట్ షెడ్యూల్ ని నవంబర్ స్టార్ట్ చేసి అక్కడ నుంచి రెగ్యులర్ షూట్ ను నాన్ స్టాప్ గా చేయాలని చూస్తున్నారట. లాగే ఈసారి చిత్రం అయితే మరింత భారీ స్కేల్ లో అలానే మరింత గ్రాండ్ క్యాస్టింగ్ తో తెరకెక్కనుంది.

ఈ సారి అంతకు మించి సినిమాను తెరకెక్కించాలని పట్టుదలతో ఉన్నాడు మూవీ హీరో... దర్శకుడు రిషబ్ శెట్టి. సినిమాపై ప్రత్యేక శ్రద్ద పెట్టనున్నారు . ఈసారి ఒకేసారి పాన్ ఇండియా వైడ్ గా సినిమా రిలీజ్ కాబోతుండటం .. బడ్జెట్ కూడా భారీగా పెట్టబోతుండగా.. ఈమూవీలో పాత్రకోసం ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంటున్నారట . హీరో రిషబ్‌శెట్టి ఈసినిమా కోసం గుర్రపుస్వారీతో పాటు కొన్ని ప్రాచీన యుద్ధ విద్యల్లో శిక్షణ పొందబోతున్నారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: