బిగ్‌బాస్ 4 తో పాపులర్ అయిన సయ్యద్ సోహైల్ ఆగస్టు 18న మిస్టర్ ప్రెగ్నెంట్‌ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చి ఎంతగానో ఆకట్టుకున్నాడు.రూపా కొడవాయుర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించి ఆకట్టుకుంది. భార్యకి వచ్చే ప్రెగ్నెన్సీని తను తీసుకొని ఒక అబ్బాయి ప్రెగ్నెంట్ గా మారితే ఏమైంది, ఇక మారిన తర్వాత అతను ఎలాంటి సమస్యలు ఎదుర్కున్నాడు, ఇంకా ఎలాంటి పరిస్థితులని చూశాడు అనే కథాంశంతో ఈ సినిమాని డైరెక్టర్ తెరకెక్కించారు.ఈ సినిమాలో కామెడీతో పాటు అమ్మ గొప్పతనం, మాతృత్వం, ఎమోషనల్ సీన్స్ ఇంకా ప్రెగ్నెన్సీ మహిళల కష్టాలు అన్ని చూపించి ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టించారు. ఎమోషనల్ మ్యూజిక్, సాంగ్స్ కూడా బాగుండటంతో ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ సినిమా బాగా కనెక్ట్ అయింది. మరీ ముఖ్యంగా మహిళలు ఈ సినిమాకి బాగా కనెక్ట్ అయ్యారు.


సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవ్వడంతో ప్రేక్షకులు థియేటర్స్ కి వస్తున్నారు. దీంతో ఈ సినిమా చాలా మంచి విజయం సాధించింది.మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా నాలుగు రోజుల్లోనే మొత్తం 4.6 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్టు చిత్రయూనిట్ ప్రకటించింది. నిన్నటితో కలిపి ఈ సినిమా కలెక్షన్స్ 5 కోట్లకు చేరింది. ఒక చిన్న సినిమాకి ఈ రేంజ్ లో వసూళ్లు రావడం అంటే ఖచ్చితంగా మంచి విజయం సాధించినట్టే. అయితే సినిమా రిలీజ్ రోజు ప్రభాస్ యోగి, ధనుష్ రఘువరన్ బీటెక్ వంటి సినిమాలు రీ రిలీజ్ కావడంతో మొదటి రోజు కలెక్షన్స్ చాలా తక్కువగా వచ్చాయి. హిట్ టాక్ రావడంతో, ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వడంతో తర్వాత సినిమాకి కలెక్షన్స్ బాగా పెరిగాయి. ఇటీవల ఇలా కొత్త కొత్త కథలతో వచ్చిన చిన్న సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతూ మంచి విజయాలు సాధిస్తున్నాయి. వాటిల్లో సోహైల్ మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా కూడా చేరింది.

మరింత సమాచారం తెలుసుకోండి: