మెగా మేనల్లుడిగా అల్లు వారి వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిశ్రమమైన అల్లు అర్జున్.. ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ క్రేజ్ సంపాదించుకున్నాడు అన్న విషయం తెలిసిందే. టాలీవుడ్ లో స్టైలిష్ స్టార్ గా కొనసాగిన అల్లు అర్జున్.. తన నటనతో ఏకంగా ఐకానిక్ స్టార్ గా మారిపోయాడు. పుష్ప సినిమాతో ఇండియన్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేశాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు పుష్ప 2 అనే సినిమాతో బిజీగా ఉన్నాడు అల్లు అర్జున్. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన గంగోత్రి సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఇతను హీరో ఏంట్రా రా బాబు అని అందరూ విమర్శలు చేసుకునే స్థాయి నుంచి హీరో అంటే ఇలాగే ఉండాలి అనుకునే స్థాయికి ఎదిగాడు.


 ఈ క్రమంలోనే అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కోసం అటు అభిమానులు అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారూ అని చెప్పాలి. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాకు సంబంధించిన అప్డేట్ రాలేదు. కానీ పర్సనల్ లైఫ్ కి సంబంధించిన ఒక ఆసక్తికర విషయం వార్తల్లో హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా అల్లు అర్జున్ మొదటి సంపాదన ఎంత అంటే గంగోత్రి సినిమాకు అతని ఎంత పారితోషకం తీసుకున్నాడు అనే విషయం గురించి అందరూ ఆలోచిస్తారు. కానీ అంతకుముందే సంపాదించడం మొదలుపెట్టాడట అల్లు అర్జున్.


 ఇండస్ట్రీ లోకి రాకముందు బన్నీ వేరే జాబ్ చేసేవాడట. అల్లు అర్జున్ కు యానిమేషన్, డిజైనింగ్ అంటే ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండేదట. ఈ నేపద్యంలో మొదట్లో ఫ్యాషన్ డిజైనర్ గా పని చేశాడట అల్లు అర్జున్. ఆ సమయంలో అల్లు అర్జున్కి  3500 జీతం ఇచ్చేవారట. ఇక ఇలా వచ్చిన శాలరీని కూడా అప్పట్లో డాన్స్ కోసమే ఖర్చు చేశారట బన్నీ.  ఇక అల్లు అర్జున్కి డాన్స్ అంటే ఎంత ఇష్టమో అభిమానులకు, ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఇప్పుడు కష్టపడిన మొత్తాన్ని కూడా డాన్స్ కోసమే వెచ్చించాడు అన్న విషయం తెలిసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: