అనంతరం ఇంకా మాట్లాడుతూ, రామ్‌కి మహా తిక్క అని, 2006లో ఆయన జర్నీ ప్రారంభమైందని, మొదటి సినిమాకి నేను గెస్ట్ గా వెళ్లాను. ఈ జర్నీలో ఎన్నో రకాల సినిమాలు చేశాడు, ఎన్నో భిన్నమైన పాత్రలు పోషించాడు, తన సినిమా ద్వారా ఎంతో కొంతదనం ఇచ్చే ప్రయత్నం చేస్తుంటారు. మనం గర్వించదగ్గ నటుడు. కళామతల్లి మనకు ఇచ్చిన వరం రామ్. ఈ సినిమాతోనూ అలరించనున్నారని చెప్పారు. శ్రీలీల గురించి చెబుతూ, అందం,అభినయం, మంచి నటన కలగలిపిన అమ్మాయి మన తెలుగమ్మాయి కావడం గర్వంగా ఉంది. చాలా అరుదుగానే తెలుగు అమ్మాయిలు రాణించారు. ఇప్పుడు శ్రీలీల రాణిస్తుంది. ఎంతో డెడికేషన్‌తో వర్క్ చేస్తుంది. నాతో `భగవంత్ కేసరి`లో నటిస్తుంద`న్నారు.
బోయపాటి గురించి చెబుతూ, `సింహా`, `లెజెండ్`, `అఖండ`సినిమాలు చేశాం. మూడు ఒకదాన్ని మించి ఒకటి ఉంటుంది. ఇవన్నీ ఇలా చేయాలని చేయలేదు, డెడికేషన్‌తో చేశాం, ఆడియెన్స్ ఆదరించారు, పెద్ద విజయాలు అందించారు. వైవిధ్యమైన సినిమాలు అందించేందుకు బోయపాటి ముందుంటారు. ఎంతో తపిస్తుంటారు. సంగీత దర్శకుడు థమన్ ఏంటో `అఖండ`తో నిరూపించాడు. బాక్సులు బద్దలయ్యేలా చేశాడు. ఇప్పుడు మరోసారి వస్తున్నారు అని తెలిపారు. ఈ సందర్భంగా థమన్ బరువు పై సెటైర్లు పేల్చాడు.
ఇక సినిమాల్లో కొత్త దనం గురించి చెబుతూ, అలాంటి సినిమాలను నిర్మాతలు నిర్మించాలని, ఆడియెన్స్ ని థియేటర్‌కి రప్పించాలన్నారు. అదే సమయంలో సినిమా అంటే వినోదం మాత్రమే కాదు, మంచి సందేశం కూడా ఉండాలని, యువతని ప్రోత్సహించేలా, వారిని ఇన్‌స్పైర్ చేసేలా ఉండలన్నారు. ఈ సందర్భంగా చంద్రయాన్ 3లో పాల్గొన మన గద్వాల్ కి చెందిన కృష్ణ గురించి చెప్పారు. కమ్మరి సామాజిక వర్గంలో జన్మించిన కృష్ణ గ్రూప్ 1లో ఉద్యోగం సంపాదించి ఇస్రో ఎగ్జామ్ రాసి చంద్రయాన్ 3లో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకున్నాడని, ఆయన డిజైన్ చేసిన దాన్నే వాడుకున్నారని, భూకంపాలను గుర్తించే పరికరాన్ని కృష్ణ డిజైన్ చేసినట్టు బాలయ్య చెప్పడం విశేషం. ఈ సందర్భంగా సినిమా పెద్ద విజయం సాధించాలని తెలిపారు.