ఇటీవల ప్రకటించిన 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాలు సత్తా చాటి దాదాపు పది పురస్కారాలు గెలుచుకున్న సంగతి తెలిసిందే. అయితే వాటిలో జాతి ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ సంపాదించుకున్నాడు. తెలుగులో నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు ని అందుకున్న మొట్టమొదటి హీరో కావడంతో గత మూడు రోజుల నుండి బన్నీకి దేశవ్యాప్తంగా ఉన్న చాలా మంది అభినందనలు తెలుపుతున్నారు. అవార్డు వచ్చిన అనంతరం మొదటిసారి అల్లు అర్జున్ మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. కాగా ఆ ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ అవార్డుతో పాటు పలు అంశాల

 గురించి సినిమాల గురించి కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. తన కుటుంబ సభ్యులు ఎలా స్పందించారు కూడా తెలిపాడు అల్లు అర్జున్ .నేషనల్ అవార్డు వచ్చాక అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి ఎలా స్పందించింది అన్న విషయాన్ని తెలియజేస్తూ..“ నన్ను పెళ్లి చేసుకున్నాక నా భార్య కన్నీళ్లు పెట్టుకొని ఎక్కువ భావోద్వేగానికి గురైంది జాతీయ పురస్కారం వచ్చిన తర్వాతే అని.. ఈ సందర్భంగా తెలిపాడు అల్లు అర్జున్. సినిమా కుటుంబం నుండి వచ్చిన అమ్మాయి కాదు అని.. తనకు సినిమాల గురించి అసలు అవగాహన లేదు అని.. సినిమా చూసి బాగుందో లేదో తనకి నచ్చిందో లేదో అన్నది మాత్రమే చెప్తుంది అని..

నా సినిమా ఎంత పెద్ద హిట్ అయినా కూడా ఫ్లాప్ అయినా కూడా తన జీవితంలో మాత్రం ఏ తేడా ఉండదు అని.. ఏదైనా పురస్కారం వచ్చినట్టు తెలిస్తే ఆ సంతోషాన్ని నాతో పంచుకుంటుంది అని.. అంతేకానీ సినిమాల గురించి తనకి అవగాహన లేదు అని తను నాకు సలహాలు కూడా ఇవ్వదు అని.. ఈ సందర్భంగా పేర్కొన్నాడు అల్లు అర్జున్. అనంతరం పిల్లల గురించి మాట్లాడుతూ ఈ విషయమై అయాన్ చాలా సంతోషంగా ఉన్నాడు అని.. ప్రతిసారి కంటే ఈసారి ఏదో పెద్దదే వచ్చింది అని అయానికి అర్థమైందని.. అర్హ కి అంతగా ఇప్పుడే అర్థం కాదు అని.. కానీ వాళ్ళ నాన్న ఏదో సాధించాడని మాత్రం తనకి అర్థమయింది అని.." ఈ సందర్భంగా వెల్లడించాడు వాళ్లు అర్జున్..!?

మరింత సమాచారం తెలుసుకోండి: