'పఠాన్' వంటి భారీ హిట్ తర్వాత బాలీవుడ్ అగ్ర హీరో షారుఖ్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం 'జవాన్'. కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో షారుక్ ఖాన్ సరసన నయనతార హీరోయిన్గా నటిస్తోంది. అంతేకాకుండా తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి తో పాటు దళపతి విజయ్ సైతం క్యామియో రోల్ చేస్తున్నట్లు వార్తలు రావడంతో ఇప్పుడు దీనిపైనే అందరి దృష్టి ఉంది. దీనికి సంబంధించి మూవీ టీం నుంచి ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు, కానీ డైరెక్టర్ అట్లీ దళపతి విజయ్ కి వీరాభిమాని అనే విషయం తెలిసిందే. అందుకే తను తెరకెక్కిస్తున్న 'జవాన్' లో విజయ్ క్యామియో రోల్ గ్యారెంటీ అని చెప్పొచ్చు. 

ఒకవేళ 'జవాన్' లో విజయ్ నటించకపోయినా, సినిమాలో ఆయన రిఫరెన్సులు మాత్రం చాలానే ఉన్నాయని లేటెస్ట్ టాక్ వినిపిస్తోంది. ఇందుకు సంబంధించి అట్లీ ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ లో  హింట్ కూడా ఇచ్చాడు. దళపతి విజయ్ ఐకానిక్ పోజ్ ని షారుక్ ఖాన్ అనుకరించే ఓ షాట్ 'జవాన్' ప్రివ్యూలో అది స్పష్టంగా కనిపిస్తుంది. ఆ ఒక్కటే కాకుండా సినిమా మొత్తం విజయ్ మేనరిజమ్స్, స్టైల్ ని షారుక్ ఖాన్ అనుకరించబోతున్నట్లు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఓ స్టార్ హీరో మేనేజర్స్ ని మరో స్టార్ హీరో అనుకరించడం ఫ్యాన్స్ కి థ్రిల్లింగ్ ట్రీట్ గా ఉంటుందని చెప్పొచ్చు. అంతేకాకుండా అలాంటి సన్నివేశాలు సినిమాని నెక్స్ట్ లెవెల్ కి ఎలివేట్ చేస్తాయి.

డైరెక్టర్ అట్లీ 'జవాన్' లో తలపతి విజయ్ డైలాగ్ డెలివరీ ని, ఆయన సిగ్నేచర్ మేనరిజమ్స్ ని తిరిగి షారుక్ ఖాన్ ద్వారా రీ క్రియేట్ చేయబోతున్నారట. ఒకవేళ ఇదే కనుక నిజమైతే తమిళ ఆడియన్స్ లో షారుక్ 'జవాన్' కి మరింత ఆదరణ దక్కుతుందని చెప్పొచ్చు.ఇక ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను రెడ్ చిల్లిస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై షారుక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ ఈ సినిమాను సుమారు రూ.200 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా, సెప్టెంబర్ 7న హిందీ, తమిళ, తెలుగు భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: