గత కొంతకాలంగా సినిమాలకు దూరమైన నారా రోహిత్ మళ్లీ తాజాగా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఐదేళ్ల క్రితం వచ్చిన 'వీర భోగ వసంత రాయలు' అనే సినిమా తర్వాత మరో సినిమా చేయలేదు ఈ హీరో. ఇక తాజాగా పొలిటికల్ థ్రిల్లర్ 'ప్రతినిధి 2' తో గ్రాండ్ గా కమ్ బ్యాక్ ఇస్తున్నారు. వానర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మూర్తి దేవగుప్తపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. సక్సెస్ ఫుల్ పొలిటికల్ థ్రిల్లర్ 'ప్రతినిధి' సిరీస్ నుండి రెండవ ఫ్రాంచైజీగా వస్తున్న ఈ చిత్రానికి “One man will stand again, against all odds” అనేది క్యాప్షన్.

ఈ రోజు ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో ప్రారంభమైయింది. హీరో నారా రోహిత్ పై కీలకమైన సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారు. ప్రతినిధి 2 కోసం బిగ్ స్పాన్ వున్న కథను ఎంచుకున్నారు నారా రోహిత్. సినిమా ఫస్ట్ లుక్ సినిమాపై చాలా  క్యూరియాసిటీ పెంచింది.కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, కొండకళ్ల రాజేందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. యువ సంచలనం మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తుండగా, నాని చమిడిశెట్టి సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. రవితేజ గిరిజాల ఎడిటర్, కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్.

ఈ చిత్రం 2024 జనవరి 25న రిపబ్లిక్ డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన  'ప్రతినిధి 'మూవీ కమర్షియల్ గా సక్సెస్ అవ్వలేదు కానీ బుల్లితెరపై మాత్రం సంచలనాల సృష్టించింది. సినిమాలో ఓ కామన్ మ్యాన్ గా నారా రోహిత్ నటన కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ప్రభుత్వం చేసే అన్యాయాలను ప్రశ్నించే ఒక సామాన్య వ్యక్తి పాత్రలో నారా రోహిత్ అదరగొట్టాడు. దీంతో ఇదే సినిమా సీక్వెల్ తో ఇప్పుడు నారా రోహిత్ మళ్లీ రీఎంట్రీ ఇస్తుండడం ప్రేక్షకుల్లో ఈ చిత్రంపై మంచి అంచనాలను ఏర్పరిచింది. మరి ఈ సినిమాతో నారా రోహిత్ కం బ్యాక్ ఇస్తాడేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: