హార్ట్ ఆపరేషన్ చేయిస్తూ..MB ఫౌండేషన్ ద్వారా ఇప్పటికే చాలామంది చిన్నారులకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ ఫౌండేషన్కు ఆయన కుటుంబ సభ్యులు మొత్తం భాగం కావడం గమనార్హం. ఇక మహేష్ బాబు భార్య, నమ్రత కూడా ఈ ఫౌండేషన్ సేవలను చాలా దగ్గరుండి చూసుకుంటోంది .ఈ ఫౌండేషన్కు సంబంధించిన వివరాలను సేవా కార్యక్రమాలను సైతం సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఉంటుంది. మహేష్ కూతురు సితార ఘట్టమనేని కూడా ఈ ఫౌండేషన్కు తన వంతు సపోర్టుగా చేస్తూనే ఉన్నది.
ఇటీవల ఆమె చేసిన ఒక యాడ్ రెమ్యూనరేషన్ మొత్తాన్ని ఈ ఫౌండేషన్ కి ఇచ్చినట్టుగా తెలియజేసి అందరి చేత శభాష్ అనిపించుకుంది సితార.. అలాగే తన పుట్టినరోజు బహుమతిగా కూడా కొంతమంది స్కూల్ విద్యార్థినిలకు సైకలు కూడా కానుకలుగా ఇచ్చింది.. ఇప్పుడు తండ్రి బాటలోనే మహేష్ కుమారుడు గౌతమ్ కూడా వెళ్లబోతున్నారు ఇటీవల కొన్ని రోజుల క్రితం రెయిన్బోలో హాస్పిటలను సందర్శించిన MB ఫౌండేషన్ ద్వారా చికిత్స చేయించుకున్న పిల్లలను పలకరించారు.. ఈ ఫోటోలను MB ఫౌండేషన్ నమ్రత సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు సైతం తండ్రికి తగ్గ కుమారుడు అంటూ గౌతమ్ ని పొగిడేస్తూ ఉన్నారు. అక్కడ పిల్లలను కలిసి వారికి మనోధైర్యాన్ని అందిస్తూ పిల్లలు ముఖంలో చిరునవ్వు అందిస్తున్నారు గౌతమ్. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.