సార్ సినిమాతో తెలుగులో 50 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్లను కొల్లగొట్టి తిరుగులేని మార్కెట్ ను పెంచుకున్నాడు హీరో ధనుష్. ప్రస్తుతం ఆయనకి తెలుగులో కూడా స్టార్ హీరోల రేంజ్ లో క్రేజ్ దక్కింది. కెప్టెన్ మిల్లర్ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు ఇప్పటినుండే ఎదురుచూస్తున్నారు. డబ్బింగ్ హక్కుల కోసం ఎంతైనా పెట్టడానికి రెడీగా ఉన్నారు నిర్మాతలు. శేఖర్ కమ్ములతో చేయబోయ సినిమాకు అయితే హై రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ వున్నాయి. ఇక ధనుష్ బర్తడే సందర్భంగా రిలీజ్ అయిన అనౌన్స్మెంట్ పోస్టర్కు ఒక రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది.

దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సినీ ఆడియన్స్. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుండి ఒక కీలక ప్రకటనను విడుదల చేశారు. కాగా ఈ సినిమాలో అక్కినేని నాగార్జున ఒక కీలకపాత్రలో కనిపించబోతున్నట్లుగా వెల్లడించారు మేకర్స్. అయితే ఈ సినిమా మొత్తం నాగార్జున చుట్టే తిరుగుతుంది అని అంటున్నారు. కాగా ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన ఏషియన్ సునీల్ కు నాగార్జునకి మధ్య ఎప్పటినుండో మంచి అనుబంధము ఉంది . దాంతో పాటు శేఖర్ కమ్ముల సైతం

 నాగచైతన్యతో లవ్ స్టోరీ సినిమాని చేశాడు. అప్పటినుండి వీళ్ళందరూ ఒకటయ్యారు. దాంతో ఈ సినిమాలో కీలక పాత్ర చేయడానికి నాగార్జున ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే సెట్స్ పైకి కూడా వెళ్లబోతోంది. ఇదిలా ఉంటే ఇక నాగార్జున తన కొత్త సినిమాలను కూడా తాజాగా ప్రకటించారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బన్నీను దర్శకుడిగా పరిచయం చేస్తూ నా సామిరంగా అనే ఒక అవుట్ అండ్ అవుట్ మాస్ సినిమా చేస్తున్నాడు నాగార్జున. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని కూడా విడుదల చేశారు మేకర్స్..!!

మరింత సమాచారం తెలుసుకోండి: