నటుడు శరత్ కుమార్ కుమార్తె హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. కోలీవుడ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది ఈ ముద్దుగుమ్మ..ప్రస్తుతం అన్ని భాషలలో నటిస్తూ బిజీగా ఉన్నప్పటికీ సౌత్ ఇండియాలో తనకంటూ ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది..హీరోయిన్గా తన సినీ కెరీర్ ని ప్రారంభించిన సక్సెస్ కాలేకపోవడంతో పలు చిత్రాలలో విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది వరలక్ష్మి శరత్ కుమార్.. తాజాగా డ్రెస్ కేసు కు సంబంధించి ఈమె పేరు వైరల్ గా మారుతోంది వాటి గురించి తెలుసుకుందాం.
తాజాగా కొచ్చి NIA అధికారులు వరలక్ష్మికి నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది.. చాలా ఏళ్లుగా తన దగ్గర పీఏ గా పనిచేస్తున్న ఆదిలింగం అనే వ్యక్తి డ్రగ్స్ మాఫియా తో సంబంధాలు ఉన్నాయని అంతేకాకుండా కీలకమైన నిందితులలో ఒకరని కూడా సమాచారం.. అందుకు సంబంధించిన ఆధారాలు ఉండడంతో ఆదిలింగం అంతర్జాతీయ డ్రగ్స్మగ్లర్ తో కూడా సంబంధాలు ఉన్నట్లు ఆధారాలు పోలీసులకు లభించాయని తెలుస్తోంది.. దీంతో ఆదిలింగం ను NIA అధికారులు సైతం అదుపులోకి తీసుకొని కస్టడీలో విచారణ చేపట్టబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


అయితే డ్రస్ సరఫరా ద్వారా వచ్చిన డబ్బులను సిని పరిశ్రమలో పెట్టుబడులుగా పెట్టినట్లు అధికారుల సైతం గుర్తించారని కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. దీంతో వరలక్ష్మి పీఏకు సంబంధించి పూర్తి వివరాల కోసం సినీనటి వరలక్ష్మిని విచారించడానికి NIA అధికారులు సామాన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది.. వరలక్ష్మి పీఏగా పనిచేస్తున్న ఆదిలింగం గతంలో అనేకసార్లు ఆమెకు డ్రగ్స్ ఇచ్చినట్లుగా కూడా అధికారులు అనుమానిస్తూ ఉండడంతో పాటు.. డ్రగ్స్ ద్వారా వచ్చిన డబ్బును సినీ పరిశ్రమలు పెట్టుబడులుగా పెట్టేందుకు కూడా ఆమెకు సహకరించారని కోణంలో అధికారులు అనుమానిస్తున్నారని సమాచారం. మరి ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం త్వరలోనే తెలియనుంది

మరింత సమాచారం తెలుసుకోండి: