సాయి పల్లవి తెలుగు సినిమాలకు కాస్త గ్యాప్ ఇస్తోంది అనే వార్తలు వినిపిస్తున్నాయి.. తనకు నచ్చిన కథలు రాకపోవడం వల్లే ఇక్కడ ఈమె సినిమాలు చేయట్లేదని సమాచారం. మిగతా హీరోయిన్ సంతా కూడా ఆఫర్స్ వస్తే చాలని కూడా వెయిట్ చేస్తున్నారు.. కానీ సాయి పల్లవి వాళ్ళలా కాకుండా తనకంటూ ఒక సపరేట్ స్టైల్ ని మెయింటైన్ చేస్తోంది. టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాలలో హీరోయిన్స్ పాత్రల కోసం కొన్నిసార్లు మాత్రమే డిమాండ్ ఉంటుంది..కథలో కథానాయక పాత్ర హైలెట్ కానప్పుడు సాయి పల్లవి నటించడానికి ఆసక్తి చూపించడం లేదు.
ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే వాళ్లు ఎంత రెమ్యూనరేషన్ ఇస్తామన్నా సరే అందుకు నో అని చెప్పేస్తుందట.. ఈ ముద్దుగుమ్మ అయితే వీటివల్ల సినిమాల కౌంట్ తగ్గినా సరే పెద్దగా పట్టించుకోవడంలేదని సమాచారం.. సాయి పల్లవి నెక్స్ట్ సినిమా కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.. కానీ ఆమె మాత్రం సినిమా విషయంలో పెద్దగా దూకుడు చూపించకుండా తనకు నచ్చిన పాత్రలనే చేసుకుంటూ వెళ్తోంది.. సినిమా సెలక్షన్ల విషయంలో తన దారి తనదే అనేలా ప్రవర్తిస్తోంది ఈ ముద్దుగుమ్మ. తెలుగులో మంచి క్రేజ్ ని అందుకుంది సాయి పల్లవి.