యూత్ ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ జులై 21న విడుదలై సూపర్‌హిట్‌గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. దీంతో ఇదే ను 'బాయ్స్ హాస్టల్' పేరుతో రిలీజ్ చేశారు. కన్నడలో స్టార్ హీరో రక్షిత్ శెట్టి ఈ ను విడుదల చేస్తే తెలుగులో అన్నపూర్ణ స్టూడియో, ఛాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ సంయుక్తంగా రిలీజ్ చేశాయి. అలాగే కన్నడ వెర్షన్‌లో రక్షిత్ శెట్టి, రమ్య పాత్రల్లో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన తరుణ్ భాస్కర్, రష్మీ గౌతమ్ కనిపించడం విశేషం. ఆగస్టు 26న విడుదలైన బాయ్స్ హాస్టల్ తెలుగు రాష్ట్రాల్లోనూ పాజిటివ్ టాక్‌తో దూసుకెళుతోంది. బాక్సాఫీస్ వద్ద మోస్తరు వసూళ్లు వస్తున్నాయి. కాగా బాయ్స్ హాస్టల్ మూవీ నిర్మాతలు ఒక బంపరాఫర్ ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఒక టికెట్ కొంటె మరొకటి ఉచితంగా పొందవచ్చని తెలిపారు. బుధవారం (ఆగస్టు 30) నుంచి ఈ ఆఫర్ అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. అది కూడా కేవలం స్టూడెంట్స్ కు మాత్రమే ఇది వర్తిస్తుందని సూచించారు. థియేటర్లలోని కౌంటర్లలో ఈ టికెట్లు పొందవచ్చని మేకర్స్ ప్రకటించారు.
ఈ మేరకు సంబంధించి థియేటర్ల లిస్టును సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. నైజాం ఏరియాలో 34 థియేటర్లు, సీడెడ్‌లో 5, కృష్ణా జిల్లాలో 2, నెల్లూరు ఒకటి, వైజాగ్‌లో ఒక థియేటర్లలో ఈ ఆఫర్ వర్తిస్తుందని పేర్కొన్నారు. మరోవైపు బాయ్స్ హాస్టల్ ఒరిజనల్ వెర్షన్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఖరారయ్యింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ 5లో సెప్టెంబర్ 1 నుంచి ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ స్ట్రీమింగ్ కానుంది. అయితే తెలుగు వెర్షన్ చూడాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ కు అజనీష్ లోక్‌నాథ్ స్వరాలు సమకూర్చారు. మరి రక్షాబంధన్ రోజున మంచి చూడాలంటే బాయ్స్ హాస్టల్ మంచి ఛాయిస్. పైగా ఎలాగో వన్‌ప్లస్ వన్ ఆఫర్ ఉంది.