తెలుగు సినీ ఇండస్ట్రీలో రీ రిలీజ్ సినిమాల హవా బాగానే కొనసాగుతోంది.. పోకిరి సినిమాతో మొదలైన ఈ రీ రిలీజ్ల ట్రెండ్ సక్సెస్ఫుల్గా ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నది.. ఇప్పటికే చాలామంది హీరోల చిత్రాలు కూడా రిలీస్ అయి భారీగానే కలెక్షన్లు రాబట్టాయి.. హీరోల పుట్టినరోజులకు అలాగే స్పెషల్ డేసులకు కూడా ఇలాంటి సూపర్ హిట్ సినిమాలను రిలీజ్ చేస్తూ అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్.. అంతేకాకుండా ఒకప్పుడు ఫ్లాప్ మూవీలను కూడా రిలీజ్ చేస్తూ సక్సెస్ అందుకుంటున్నారు.



కలెక్షన్ల పరంగా కూడా భారీగా రాబడుతూ ఉండడంతో చాలామంది నిర్మాతలు సైతం ఇదే ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్ నటించిన గత చిత్రాలు రీ రిలీజ్ అయ్యి ఇప్పటికే ఆడియన్స్ను బాగా ఆకట్టుకుంటున్నాయి. ప్రభాస్ నటించిన బిల్లా, యోగి తదితర చిత్రాలు విడుదలై బాగానే ఆకట్టుకున్నాయి.. ఇప్పుడు తాజాగా మరొక సినిమా రీ రిలీజ్ కు  రెడీ కాబోతోంది.. దీంతో ప్రేక్షకులలో మరొకసారి క్యూరియాసిటీ పెంచేస్తోంది ఈ చిత్రం .ఇప్పుడు రిలీజ్ కు రెడీ అయిన ఆ సినిమా ఏంటంటే ఆ సినిమా ఏదో కాదు మున్నా.. ఈ చిత్రాన్ని వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ప్రభాస్ చాలా స్టైలిష్ గా ఆకట్టుకున్నారు కానీ ఈ సినిమా సక్సెస్ కాలేక పోయింది.

ఈ చిత్రంతోపాటు చిరంజీవి నటించిన శంకర్ దాదా MBBS సినిమా కూడా ఏడాది నవంబర్లో మళ్ళీ రి రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ కు ఇది ఐదవ సినిమా అన్నట్లుగా తెలుస్తోంది. ప్రభాస్ నటించిన సలార్ సినిమా కూడా సెప్టెంబర్ లో రిలీజ్ కాబోతోంది ఈ చిత్రాన్ని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా రిలీజ్ అయిన తరువాతే మున్నా సినిమా రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తోంది మరి అప్పుడు ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న మున్నా చిత్రం చిరంజీవి సినిమాకి పోటీగా ఇస్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: