ప్రతిభావంతులైన డైరెక్టర్లలో మోహన్ రాజా కూడా ఒకరు. తన కెరీర్ లో బ్లాక్ బస్టర్ సినిమాగా తని ఓరువన్ చిత్రానికి సీక్వెల్ ప్రారంభించినట్లు నిన్నటి రోజున తెలియజేశారు. ఈ ప్రకటనతో రామ్ చరణ్ ధ్రువ -2 లో కూడా నటిస్తారా లేదా అనే విషయంపై అభిమానులు అడగడం జరిగింది. ఈ చిత్రాన్ని తెలుగులో సురేందర్ రెడ్డి ఎంతో అద్భుతంగా ధ్రువ సినిమాని తెరకెక్కించారు. దీంతో ధ్రువ సినిమా సీక్వెల్ కూడా వస్తే బాగుంటుందని మెగా అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే రామ్ చరణ్ ఆలోచనలు మాత్రం మరొక లాగా ఉన్నట్లు తాజాగా రివీల్ అయినట్లు తెలుస్తోంది.


వాస్తవానికి తని ఓరువన్ -2 చిత్రీకరణ ప్రారంభించక ముందే రామ్ చరణ్ తో ధ్రువ -2 సినిమా స్టైమాలిటీ నియర్ గా ప్రారంభించాలని మోహన్ రాజ భావించారట. అయితే ఈ విషయానికి చరణ్ ముందు ఉంచిన ఈ ప్రాజెక్టు ఓకే కాలేదని సమాచారం.ధ్రువ -2లో వెంటనే నటించే ఆలోచన లేదని డైరెక్టర్ కి తెలియజేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్లు గేమ్ చేంజెర్ పైన పూర్తిగా దృష్టి పెట్టినట్లు సమాచారం.


సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ బుచ్చిబాబుతో స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో మరొక సినిమా అని తెరకెక్కించే పనిలో పడ్డారు ఇప్పటికే డైరెక్టర్ విక్రమ్ దర్శకుడు లోకేష్ కనకరాజు తో కూడా కథ వినబోతున్నట్లు సమాచారం .కానీ ఇది కూడా ఓకే కాలేదట ..దీంతో రామ్ చరణ్ సినిమాని తిరస్కరించారని సమాచారం. ఇదే సమయంలో ధ్రువ సినిమా సీక్వెల్ పైన కూడా పెద్దగా ఆసక్తి లేదని వార్తలు కూడా వినిపిస్తున్నాయి అయితే ఎందుకు కారణాలు ఏంటి అనే విషయం మాత్రం తెలియడం లేదు. మరి రాబోయే రోజుల్లో నైనా ధ్రువ సినిమా సీక్వెల్ రామ్ చరణ్ తెరకెక్కిస్తారేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: