దాదాపుగా నగ్మా వెల్లితెరకు దూరమై 20 ఏళ్లు అవుతోంది.ఆ తర్వాత పలు భాషలలో నటించి చివరిగా 2008లో నటనకు గుడ్ బై చేసి రాజకీయాల వైపు అడుగులు వేసింది. స్టార్ హీరోయిన్ గా ఉన్న సమయంలో చాలామంది తో ఈమె ప్రేమాయణం నడిపినట్లుగా వార్తలు వినిపించాయి.. ఇలాంటి వాటివల్లే ఈమె ఇంకా వివాహం చేసుకోకుండా ఒంటరిగానే ఉంటుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈమె వయసు 48 ఏళ్ళు అవుతున్నప్పటికీ వివాహ విషయం పైన గురించి పలు విషయాలను తెలియజేసింది.
తాజాగా నగ్మా పెళ్లి గురించి మాట్లాడుతూ పెళ్లి చేసుకోకూడదన్న ఆలోచన తనకు లేదని ఇంకా చెప్పాలి అంటే కచ్చితంగా తనకొక తోడు ఉండాలి పిల్లలు ఉండాలనే ఆశ పెళ్లి ద్వారా ఒక కుటుంబాన్ని ఏర్పరుచుకోవాలని కోరిక ఉన్నది.. కాలం కలిసొస్తే త్వరలోనే పెళ్లి జరుగుతుందేమో చూద్దామంటు తెలియజేసింది నగ్మా. ఒకవేళ నిజంగానే పెళ్లయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతానని తెలిపింది..జీవితంలో కొంతకాలానికి పరిమితం కాదు అంటూ తెలిపింది నగ్మా. నగ్మా కెరియర్లో చాలామంది హీరోలతో లవ్ లో పడిందని కానీ పెళ్లిదాకా వెళ్లకముందే వేరుతో బ్రేకప్ అయ్యిందని ప్రచారం జరుగుతూనే ఉంటుంది.. మరి వివాహం చేసుకొని అభిమానులను ఆనందపరుస్తుందేమో చూడాలి మరి.