Rc -16 ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసం ఆఫీసును కూడా ఓపెన్ చేశారు. దీంతో క్యాస్టింగ్ సెలక్షన్స్ తో పాటు మిగిలిన ప్రొడక్షన్స్ కూడా అన్ని జోరు అందుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో హీరోయిన్ గా జాన్వీ కపూర్ ను తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. స్పోర్ట్స్ బ్యాక్ గ్రౌండ్ లో పీరియాడికల్ జోన్లో ఈ సినిమాని తెరకెక్కించబోతున్నట్లు సమాచారం.ఇదంతా ఇలా ఉండగా తాజాగా మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఈ చిత్రానికి సంబంధించి వైరల్ గా మారుతోంది.
ఈ చిత్రంలో చరణ్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నారని అది కూడా తండ్రి కొడుకులు లాగే కనిపించబోతున్నట్లు సమాచారం..ఒకటి ఏజ్ ఎక్కువ ఉన్న పాత్ర కాగా మరొకటి యంగ్ పాత్రలో కనిపించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే గేమ్ చేయింజర్ సినిమాలో కూడా రామ్ చరణ్ తండ్రి కొడుకులు గా కనిపించబోతున్నారు. ఇందులో ఒక పొలిటికల్ లీడర్ పాత్ర కాక మరొకటి ఆఫీసర్ అధికారి పాత్రలో కనిపించబోతున్నారు. ఈ రెండు పాత్రలని చరణ్ ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి మరి.
ఇక ఇప్పుడు బుచ్చిబాబు దర్శకత్వంలో ఆర్సి 16 సినిమా కోసం మరొకసారి డ్యూయల్ రోల్ పాత్ర అంటే ఇది ఒక సాహసమైనని కూడా చెప్పవచ్చు. మరి ఆడియన్స్ కి ఏ విధంగా కనెక్ట్ అవుతుందో చూడాలి మరి.