సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా చేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. కాగా ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ సగం వరకు పూర్తి కావలసి ఉండగా కొన్ని అనివార్య కారణాలవల్ల రోజురోజుకీ ఆలస్యం అవుతూనే వస్తుంది. అయితే ఈ మధ్యనే వెకేషన్ నుండి తిరిగి వచ్చిన మహేష్ బాబు ప్రస్తుతం బ్రేకులు లేకుండా గుంటూరు కారం సినిమాలో పాల్గొంటున్నట్లుగా తెలుస్తోంది. కాగా ఈ సినిమా తర్వాత మహేష్ బాబు నటిస్తున్న 29 వ సినిమా.  దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఇప్పటివరకు  రాజమౌళి మొట్టమొదటిసారిగా మహేష్ బాబుతో సినిమా చేస్తుండడంతో అందరిలో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. ఫారెస్ట్ అడ్వెంచర్ నేపథ్యంలో మహేష్ తో ఈ సినిమాని తెరకేకిస్తున్నారు. ఇక ఈ విషయాన్ని కి సంబంధించిన హింట్ కూడా ఇచ్చాడు రాజమౌళి. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోని ఈ సినిమాకి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ ఇస్తారా అని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు అభిమానులు. అయితే రాజమౌళి మరియు మహేష్ బాబు బయట కలవడం చాలా అరుదు.

 మహేష్ ఒక సినిమా ఒప్పుకున్నాడు అంటే ఆయన ఎక్కడ ఉంటే ఆ డైరెక్టర్ కూడా అక్కడే ఉండేటట్లుగా చూసుకుంటారు. కానీ రాజమౌళి మాత్రం మహేష్ తో కనిపించడం చాలా అరుదు. తాజాగా అందుతున్న సమాచారం మేరకు రాజమౌళి మరియు మహేష్ బాబు ఇవాళ కలవబోతున్నారు అన్న వార్తలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అయితే ఈ సినిమా ప్రొడ్యూసర్ కేఎల్ నారాయణ కుమార్తె పెళ్లికి మహేష్ బాబు తో పాటు రాజమౌళి సైతం రాబోతున్నట్లుగా తెలుస్తోంది. అక్కడే వీరిద్దరూ కలిసి కనిపిస్తారు అని అంటున్నారు. దీంతో అభిమానులు ఈ పెళ్లి కోసం మహేష్ బాబు మరియు రాజమౌళి కలిసి దిగబోయే ఫోటోల కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ పెళ్లి తర్వాత ఆయన ఈ సినిమాకి సంబంధించిన ఒక అప్డేట్ అయినా ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: