బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ మరియు గ్లోబల్ స్టార్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్న సినిమా వార్ 2. ఇక ఈ క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికీ భారీ అంచనాలు నెలకొన్నాయి.యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. స్పై యూనివర్స్ లో భాగంగా ఉండబోతుంది అన్న సమాచారం వినబడుతోంది. 2019లో వచ్చిన సినిమాకి సీక్వెల్ గా వర్ 2  ఉండబోతుంది అని అంటున్నారు. కాగా జూనియర్ ఎన్టీఆర్ ఉండడంతో ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు ఒక రేంజ్ లో నెలకొన్నాయి.

ఇక అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాని ఎప్పుడు రిలీజ్ చేయాలి అని దర్శక నిర్మాతలు ప్లాన్ కూడా చేసుకున్నారు అన్న వార్తలు వినబడుతున్నాయి. అయితే ఈ సినిమాని 2025 రిపబ్లిక్ డే సందర్భంగా థియేటర్స్ లో విడుదల చేయాలి అని భావిస్తుంది అన్న సమాచారం వినబడుతోంది. పబ్లిక్ డే వీకెండ్ అయిన 2025 జనవరి 24వ తేదీన ఈ సినిమాని విడుదల చేయాలి అన్న ఆలోచనలో ఉన్నారట. కాగా ఏడాది నవంబర్ లేదా డిసెంబర్లో ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కూడా మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కాగా ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ విలన్ పాత్రలో కనిపిస్తారు అన్న వార్తలు సోషల్ మీడియా వేదికగా తెగవారిలా అవుతున్నాయి. సిద్ధార్థ ఆనంద్ దర్శకత్వంలో  రోషన్ మరియు టైగర్ స్టాఫ్ ప్రధాన పాత్రలో నటించిన వార్ సినిమా 2019లో విడుదలై ఎంతటి విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే. దాంతోపాటు భారీ కలెక్షన్స్ ని సైతం రాబట్టింది ఈ సినిమా. కాగా ఈ సినిమాకి సీక్వెల్ గా ఇప్పుడు రాబోతోంది. ఇదిలా ఉంటే ఇక జూనియర్ ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్నాడు ఆయన. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో రూపొందిస్తున్నారు. కాగా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ ఖలీఖాన్ విలన్ గా నటిస్తున్నారు. జాన్వి కపూర్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: