అయితే ఆమె వయసు కేవలం 31 సంవత్సరాలు మాత్రమే కావడంతో ఈ విషయం ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారింది.అపర్ణ తన నివాసంలో అపస్మారక స్థితిలో ఉండడం చూసి కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అయితే అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. అంత చిన్న వయసులోనే అపర్ణ మరణించడం అందరిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఇకపోతే తిరువనంతపురం లోని అపర్ణ నివాసంలోనే ఈ ఘటన జరగగా ఆమె ఎలా మరణించింది అనే విషయాలు మాత్రం ఇంకా బయటకు రాలేదు. ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం జరిపిస్తున్నారు.
అపర్ణ ఎందుకు మరణించింది ఎలా మరణించింది అనే విషయాలు తెలియాలి అంటే ఇక పూర్తి వివరాలు బయటకి రావాల్సిందే అని పోలీసులు వెల్లడించారు. ఇకపోతే అపర్ణ మరణించారని తెలిసి మలయాళం సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. ఇక అపర్ణ విషయానికి వస్తే .. మలయాళం లో బుల్లితెరపై క్రేజీ నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఈమె తన నటనతో, అందంతో ఎంతోమంది కుర్ర కారును తన వశం చేసుకుంది. సినిమాలలో నటిస్తే హీరోయిన్ అయ్యే అవకాశాలు ఉన్నప్పటికీ ఎందుకో అపర్ణ బుల్లితెరకే పరిమితమైందని చెప్పవచ్చు ఇకపోతే అపర్ణ మరణం సహజమైన మరణం కాదు అని, ఏదో ఒక కారణం ఉందని పోలీసులు అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది. మరి అపర్ణ మరణానికి గల కారణం తెలియాలి అంటే పూర్తి వివరాలు వెలువడాల్సిందే. ఇకపోతే అపర్ణకు పెళ్లయి ఇద్దరు ఆడపిల్లలు కూడా ఉన్నారు.