ఒకప్పుడు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేసి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న అందాల తార అనుష్క శెట్టి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కన్నడ ముద్దుగుమ్మ అయిన ఈమె తెలుగు ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయింది. తన నటన అందంతో అందరినీ ఆకట్టుకుంది అనుష్క. ఏ పాత్రనైనా సరే ఇట్టి పట్టేసి అందరినీ మెప్పించింది. బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియా హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక స్టార్డం క్రియేట్ చేసుకుంది. ఇక ఈమె నటించిన సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాలను అందుకున్నాయి. 

బాహుబలి సినిమా తర్వాత  చేసిన సినిమాలు అన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలు కావడం గమనార్హం. కానీ ఎందుకో తెలియదు కానీ అనూహ్యంగా ఈమె సినిమాలో చేయడం మానేసింది. చివరిగా భాగమతి సైజ్ జీరో నిశ్శబ్దం వంటి సినిమాలు తో ఆగిపోయిన అనుష్క ఆ తర్వాత చాలా సంవత్సరాలు సినీ ఇండస్ట్రీకి దూరమైంది .తాజాగా ఇప్పుడు మిస్సెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. కాగా సైజ్ జీరో సినిమా కోసం బరువు పెరిగిన ఆమె అదే షేప్ కంటిన్యూ చేస్తూ వచ్చింది. అయితే ఈ సినిమా సమయంలో కూడా బరువు అలానే పెరుగుతు వచ్చింది.

ఇక తాజాగా విడుదలైన షెట్టి మిస్టర్  పోశెట్టి సినిమా ట్రైలర్లో సైతం అనుష్క బాగా లావుగా కనిపించడం మనం గమనించవచ్చు. దీంతో అనుష్క ఫ్యాన్స్ అందరూ నిరాశ పడుతున్నారు. అందుకే అనుష్కసినిమా ప్రమోషన్స్ కి రావట్లేదు కాబోలు అని అంటున్నారు. అనుష్కసినిమా ప్రమోషన్స్ కి రాకపోవడానికి ప్రధాన కారణం తను బొద్దుగా మారడమే అని అంటున్నారు ఇక అధిక బరువు తగ్గాక ప్రమోషన్స్ లో కనిపించాలని ఈ నేపథ్యంలోని ఆమె చాలా ప్రయత్నాలు కూడా చేస్తుంది. కానీ ఆ ప్రయత్నం మాత్రం ఆమెకు సఫలం కావడం లేదు .అధిక బరువు సమస్య కారణంగానే ప్రమోషన్స్ కి అనుష్క రాలేకపోతుంది అని అంటున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: