టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ముందు వరుసలో ఉంటాడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా తనకంటి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న ప్రభాస్ అంతర్జాతీయ స్థాయిలో తిరుగులేని మార్కెట్ ని తన సొంతం చేసుకున్నాడు. బాహుబలి సినిమా రాకముందు కేవలం తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగే వాడు. కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ సినిమాలకి సినీ లవర్స్ బ్రహ్మరథం పడుతున్నారు అని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడు

అంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు అందరూ వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇక ఆ మధ్య బాలకృష్ణ షో లో సైతం పెళ్లి ప్రస్తావన వచ్చింది. ఇక ఆ ప్రశ్నలను దాటేస్తూ వచ్చాడు ప్రభాస్. ఇదిలా ఉంటే ఇక హీరో ప్రభాస్ పెళ్లికి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు ఇండియా మొత్తాన్ని షేక్ చేస్తోంది. ఇక అసలు విషయం ఏంటి అంటే  కృష్ణంరాజు భార్య ఇటీవల ఒక మంచి సంబంధం తీసుకు వచ్చిందిట. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణానికి చెందిన ఒక గొప్పింటి అమ్మాయిని ప్రభాస్కి ఇచ్చే పెళ్లి చేయాలని నిశ్చయించుకుందట.

ఇక ఆ అమ్మాయి ప్రస్తుతం అమెరికాలో ఉంది అని.. బిజినెస్ కి సంబంధించి పెద్ద కోర్సులు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. చదువు చివరికి రావడంతో ప్రభాస్ సైతం ఆ అమ్మాయి ఫోటో చూసి  పాజిటివ్ గా రెస్పాండ్ అయినట్లు తెలుస్తోంది. దాదాపు ఈ సంబంధం ఖాయమని అంటున్నారు. దీంతో ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే ఇక ప్రస్తుతం ప్రభాస సలార్ సినిమా చేస్తున్నాడు. కే జి ఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదల కాబోతోంది. సెప్టెంబర్ 28న ఈ సినిమా విడుదల కి సిద్ధంగా ఉంది ..!!

మరింత సమాచారం తెలుసుకోండి: