టాలీవుడ్ లో ఒకప్పుడూ స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది సీనియర్ హీరోయిన్ నగ్మా. చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకటేష్ లాంటి టాప్ స్టార్ట్స్ తో నటించి చాలా తక్కువ సమయంలో తెలుగులో స్టార్ హీరోయిన్గా క్రేజ్ తెచ్చుకుంది. సల్మాన్ ఖాన్ సరసన 'భాగీ' సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈమె అక్కడ పలు సినిమాల్లో నటించింది. తెలుగు, హిందీ తో పాటు తమిళ, మలయాళ, కన్నడ, భోజ్ పురి, మరాఠీ చిత్రాల్లో కూడా నటించి మెప్పించింది. 1990 నుంచి 2008 వరకు సినిమాల్లో కొనసాగిన నగ్మా, ఆ తర్వాత రాజకీయాల్లోనూ ఎంట్రీ ఇచ్చింది. 

2004లో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరగా.. 2015లో ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా ఎంపికయింది.   ఇక ఈ మధ్య హీరోలతో ఎఫైర్స్ వార్తలతో ఎక్కువగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ఇదిలా ఉంటె నగ్మా ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. ప్రస్తుతం ఆమెకు 48ఏళ్ళు. కానీ తాజాగా ఈమె పెళ్లిపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు తనకు పెళ్లి చేసుకోవాలని ఉందంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది నగ్మా. ఇక ఆమె మాటలు విన్న నెటిజెన్స్ ఈ వయసులో పెళ్లి ఏంటి? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నగ్మా తన రాజకీయ జీవితం, పెళ్లి గురించి చెప్పుకొచ్చింది. 

తనకు ఇప్పుడు 48ఏళ్ళు ఉన్నా కూడా పెళ్లి చేసుకొని భర్త, పిల్లలతో కుటుంబాన్ని పోషించాలని కోరుకుంటున్నట్లు చెప్పింది."  వివాహం చేసుకోకూడదు అనే నియమం నేను అసలు పెట్టుకోలేదు. పెళ్లి చేసుకొని పిల్లల్ని కనాలి. మనకు ఒక తోడు, కుటుంబం కావాలని నాకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది. అయితే కాలం కలిసి వస్తే నాకు పెళ్లి అవుతుందేమో చూడాలి. పెళ్లి అయితే కనుక నేను ఫుల్ హ్యాపీగా ఉంటాను. కానీ సంతోషం కొంతకాలానికి పరిమితం కాకూడదు కదా.." అంటూ చెప్పుకొచ్చింది నగ్మా. దీంతో పెళ్లిపై నగ్మా చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: