గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఉపాసన దంపతులకి జూన్ 20 న పాప పుట్టిన సంగతి తెలిసినదే. ఇక ఈ జంటకి పెళ్లయి 11 ఏళ్ల తర్వాత ఆడపిల్ల జన్మించడంతో మెగా కుటుంబం పండగ చేసుకుంటుంది అని చెప్పాలి. ఇక మెగా వారసురాలికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఉపాసన దంపతులు క్లింకార అని నామకరణం కూడా చేయడం జరిగింది. ఇక పాప పుట్టి రెండు నెలలు గడుస్తున్నా కూడా మీడియాకు మాత్రం మెగా వారసురాలి ముఖాన్ని ఇప్పటివరకు రివీల్ చేయలేదు మెగా కుటుంబం. పాప ఎలా ఉంటుందో చూడడానికే మెగా అభిమానులతో పాటు కామన్

 ఆడియన్స్ సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మధ్యనే ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా క్లింకారా తో జెండా ఎగర వేయించారు మెగా కుటుంబం. కానీ అప్పుడు మాత్రం పాపముఖం కొంచెం కూడా కనబడకుండా అనేక రకమైన జాగ్రత్తలను వహించారు. ఈ నేపథ్యంలోని తాజాగా ఇప్పుడు మరొకసారి అలానే పాప మొహం కనబడకుండా ఫోటోని దాచేశారు ఉపాసన. అయితే తాజాగా ఉపాసన తన ముద్దుల కూతురు క్లింకారతో కలిసి మొదటిసారిగా వరలక్ష్మి వ్రతం చేయడం జరిగింది. కాగా ఈ విషయాన్ని తన అభిమానులతో పంచుకుంటూ

 తన సూషల్ మీడియా వేదికగా వారికి సంబంధించిన ఫోటోలను షేర్ చేయడం జరిగింది. అందులో తన పాపని ఎత్తుకొని ఫోటోలకి పోసులు ఇచ్చింది ఉపాసన. కానీ అందులో కూడా పాప ముఖం కనబడకుండా కవర్ చేసింది. అయితే ఆ ఫోటోకు పాపా మొదటి వరలక్ష్మి పూజ ఇంతకు మించి ఇంకేమీ అడగలేను అంటూ ఆ ఫోటోకి కింద ఒక క్యాప్షన్ కూడా జోడించింది ఉపాసన. అందకు మా మెగా చిట్టితల్లి అంటూ కామెంట్లను చేస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం క్లింకారకి సంబంధించిన ఈ ఫోటోలు కాస్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అంతేకాదు క్లింకారిని ఎప్పుడెప్పుడు చూద్దామని ఎదురుచూస్తున్నారు అందరూ..!!

మరింత సమాచారం తెలుసుకోండి: