గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు దర్శకుడు బుచ్చి బాబు కాంబినేషన్లో లేటెస్ట్గా వస్తున్న మూవీ ఆర్ సి 16. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సైతం ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు అన్న సమాచారం ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అయితే ఇంతకుముందు రామచరణ్ నటించిన సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కనిపించినా కూడా అందులో కేవలం గెస్ట్ రోల్ మాత్రమే చేసరూ..కానీ బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చే ఆ సినిమాలో మాత్రం మెగాస్టార్ చిరంజీవిది ఫుల్ లెన్త్ రోల్ ఉండబోతోంది అన్న వార్తలు వినబడుతున్నాయి.

 ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ ఏడాది డిసెంబర్ లేదా వచ్చి ఏడాది జనవరిలో ఈ సినిమా స్టార్ట్ కాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో చిరు ఎటువంటి పాత్రలో కనిపిస్తాడు చిరంజీవితో ఈ సినిమా ఎలా మలుపు తిరగబోతుంది అన్న విషయాలు ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారాయి. ఇదిలా ఉంటే ఇక రాంచరణ్ మరియు బుచ్చిబాబు కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా స్పోర్ట్స్ బాగ్రాఫ్తో గ్రామీణ నేపథ్యంలో ఉంటుంది అని అంటున్నారు. స్పోర్ట్స్ లో హీరోకు మెలుకువలు నేర్పే పాత్రకు ఎవరిని తీసుకుందాము అన్న ఆలోచన చేస్తుండగా మెగాస్టార్ చిరంజీవి

అయితే ఈ సినిమాకి మంచి హైప్ వస్తుంది అన్న ఆలోచనతో చిత్ర బృందం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దాంతో పాటు మెగాస్టార్ చిరంజీవికి కూడా ఆ పాత్రలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇందుకు ఎటువంటి ఆటంకాలు లేవు అని అంటున్నారు . ఇక ప్రస్తుతం ఈ వార్త తెలియడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత ఎక్కువయ్యాయి. ప్రస్తుతం రామ్ చరణ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మరొక సినిమా చేస్తున్నాడు. గేమ్ చేంజెస్ సినిమాలో నటిస్తున్న రామ్ చరణ్ ప్రస్తుతం బిజీ బిజీగా ఉన్నాడు. కాగా ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికి ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్లు సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: