పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేడు తన పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్న నేపథ్యంలో.. రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న జనసైనికులు, జన వీర మహిళలు, పవన్ కళ్యాణ్ అభిమానులు , సేవా, సామాజిక కార్యక్రమాలు చేపడుతూ మరొకసారి ఆయనపై ఉన్న ప్రేమను నిరూపించుకుంటున్నారు. ముఖ్యంగా అన్ని వర్గాల ప్రజలకు మేలు చేయడానికి రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ కి తాజాగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఒక అదిరిపోయే గిఫ్ట్ను అందించారు.

వాస్తవానికి పవన్ కళ్యాణ్ కు వ్యవసాయం చేయడం అంటే చాలా ఇష్టం. ఇక దానినే ఉదాహరణ గా తీసుకొని తెనాలి నియోజకవర్గం అత్తోట గ్రామ వాస్తవ్యులు,  రైతులు వినూత్నంగా ఆలోచించి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కౌలు రైతులకు అండగా నిలిచినందుకు కృతజ్ఞతగా పొలంలో వరి నాట్లతో జనసేన పార్టీ చిహ్నాన్ని ,తమ మనసులో ఉన్న భావాన్ని వేసి చూపించారు. ఇక దేశంలోని బడుగు బలహీన వర్గాల వారికి అలాగే కౌలు రైతులకు అండగా నిలవడమే తమకు సంతోషమని చెప్పిన పవన్ కళ్యాణ్ ఆ దిశగానే సేవలు అందిస్తున్నారు .
ఇక సినిమాల ద్వారా వచ్చిన డబ్బులు కౌలు రైతులకు అందజేసిన విషయం తెలిసిందే.  అందుకోసమే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పై తమ అభిమానాన్ని ఇలా చాటుకున్నారు . పచ్చటి పొలాల మధ్య జనసేన గుర్తుతో పవన్ కళ్యాణ్ పై ఉన్న ప్రేమను వరి నాట్లతో నిరూపించుకోవడం నిజంగా చూడడానికి అద్భుతంగా ఉందని చెప్పాలి.ఇకపోతే ఈ గిఫ్ట్ పవన్ కళ్యాణ్ కు ఎప్పటికీ మరిచిపోలేని గిఫ్ట్ అవుతుందనడం లో సందేహం లేదు. ఇదిలా ఉండగా మరొకవైపు విజయవాడలోని బెంజ్ సర్కిల్ దగ్గర పవన్ కళ్యాణ్ బర్తడే సందర్భంగా.. అభిమానులు, జనసేన నాయకులు శుభాకాంక్షలు తెలుపుతూ భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అంతేకాదు ఉదయాన్నే భవన నిర్మాణ పనులకు వెళ్లే కార్మికుల కోసం అల్పాహారం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తానికి అయితే పవన్ కళ్యాణ్ కు అదిరిపోయే బర్తడే గిఫ్ట్ లభించిందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: