చంద్రముఖి మొదటి భాగంలో రజినీకాంత్ హీరోగా నయనతార హీరోయిన్గా నటించగా జ్యోతిక చంద్రముఖి పాత్రలో అదరగొట్టేసింది.. అందుకే ఈ సినిమా ని దాదాపుగా 17 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ సినిమాని సీక్వెల్ చేయబోతున్నట్లు ప్రకటించినప్పటి నుంచి ఈ సినిమా పైన మంచి హైప్ ఏర్పడుతోంది..ఇందులో భాగంగానే ప్రమోషన్స్ లో వేగవంతం చేసిన చిత్ర బృందం ఈరోజు ట్రైలర్ విడుదల చేయడం జరిగింది. ట్రైలర్ అద్వంతం అందరినీ ఆకట్టుకునేలా కనిపిస్తోంది. ట్రైలర్ మొత్తం వడివేలు భయపెడుతూ తనదైన స్టైల్ లో కామెడీ తో ప్రేక్షకులను మెప్పించేలా కనిపిస్తూ ఉన్నారు.
ముఖ్యంగా ఇందులోని రాఘవ లారెన్స్ చెప్పే డైలాగులు.. కంగనా రనౌత్ నటన అద్భుతంగా ఉండేలా కనిపిస్తోంది చంద్రముఖి మధ్యలో పగ ఉన్నట్లుగా కూడా ట్రైలర్లో చూపించడం జరిగింది. సూపర్ సార్ రజనీకాంత్ నటించిన చంద్రముఖి సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా రజినీకాంత్ క్రేజీ చేసింది 2005లో ఈ సినిమా రావడం జరిగింది. తాజాగా చంద్రముఖి-2 చిత్రాన్ని లైక ప్రొడక్షన్ బ్యానర్ పైన నిర్మిస్తూ ఉన్నారు. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో తెలియాలి అంటే సెప్టెంబర్ 19వ తేదీ వరకు ఆగాల్సిందే.. ప్రస్తుతం అందరికి సంబంధించి ట్రైలర్ వైరల్ గా మారుతోంది.