రాబోయే సంవత్సరం విడుదల కాబోతున్న సినిమాలాలో ‘కల్కి’ 2898 ఏడీ’ పై విపరీతమైన అంచనాలు ఉన్నాయి. సైన్స్ ఫిక్షన్ మూవీగా అత్యంత భారీ బడ్జెట్ తో తీస్తున్న ఈమూవీ ప్రభాస్ కెరియర్ కు సంబంధించి అత్యంత కీలకంగా మారింది. అమితాబ్ బచ్చన్ దీపికా పదుకొనే లతో పాటు ఈమూవీలో విలన్ పాత్రలలో నటిస్తున్న కమలహాసన్ కు ఈమూవీకి సంబంధించి 100 కోట్ల భారీ పారితోషికం ఇస్తున్నట్లుగా వస్తున్న వార్తలు విని ఇండస్ట్రీ వర్గాలు షాక్ అవుతున్నాయి.


ఇప్పుడు ఈసినిమాకు సంబంధించిన మరొక లేటెస్ట్ న్యూస్ ఇండస్ట్రీ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. ఈమూవీలో ఒక అతిధి పాత్రలో రాజమౌళి నటించడానికి ప్రభాస్ బలవంతంతో ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఎన్నో బ్లాక్ బష్టర్ సినిమాలకు దర్శకత్వం వహించిన రాజమౌళి సినిమాలలో నటించిన సందర్భాలు చాల అరుదు. ‘మజ్ను’ సినిమాలో చిన్న అతిధి పాత్రలో రాజమౌళి నటించిన విషయం తెలిసిందే.


అయితే ‘కల్కి’ మూవీకి సంబంధించి మాత్రం రాజామౌళి నటించబోయే అతిధి పాత్ర ఆసినిమాకు అత్యంత కీలకంగా మారనుంది అన్న సంకేతాలు వస్తున్నాయి. ఈ మూవీ కథను మలుపు తిప్పే సైంటిస్ట్ పాత్రలో రాజమౌళి నటిస్తున్నాడని తెలుస్తోంది. పాన్ ఇండియా మూవీగా 500 కోట్ల భారీ బడ్జెట్ తో తీస్తున్న ఈమూవీ వాస్తవానికి వచ్చే సంక్రాంతికి విడుదల కావలసి ఉన్నప్పటికీ ఈమూవీకి సంబంధించిన గ్రాఫిక్ వర్క్స్ పూర్తి చేయడంలో ఆలస్యం అవుతుంది కాబట్టి ఈమూవీని వచ్చే సంవత్సరం సమ్మర్ రేస్ లో విడుదల చేస్తారు అని అంటున్నారు.


ఒకప్పుడు ప్రముఖ దర్శకులుగా ఇండస్ట్రీని శాసించిన దాసరి నారాయణరావు విశ్వనాథ్ నటులుగా కూడ ఎంతగానో రాణించారు. ఇప్పుడు ‘కల్కి’ మూవీలో రాజమౌళి నటించే పాత్ర అందరికీ నచ్చితే రానున్న రోజులలో జక్కన్న ప్రముఖ దర్శకుడుగా కొనసాగుతూనే కొన్ని సినిమాలలో మంచి పాత్రలు చేసే ఆస్కారం ఉంది అనుకోవాలి. మరి ప్రేక్షకులు రాజమౌళి ను నటుడుగా గుర్తిస్తారో లేదో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: