టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న రష్మిక మందనా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కన్నడ ఇండస్ట్రీ నుండి తెలుగులోకి వచ్చిన ఈమె చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. చలో సినిమాతో హీరోయిన్గా పరిచయమైన ఈమె ఆ తర్వాత గీత గోవిందం సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. అనంతరం మహేష్ బాబు సరసన సరిలేరు నీకెవ్వరు సినిమాతో మరొక విజయాన్ని అందుకుంది .అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సాలిడ్ తో ఈమెకి వరుస అవకాశాలు వచ్చాయి.

ఇక ఈ సినిమా తరువాత రష్మిక ఏకంగా పుష్పా సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్పా సినిమాలో డి గ్లామర్ లుక్ లో కనిపించి అందరినీ తెగ ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. అనంతరం ప్రస్తుతం ఇప్పుడు పుష్ప టు సినిమా షూటింగ్లో బిజీగా ఉంది రష్మిక మందన. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక తెలుగుతోపాటు తమిళ భాషలలో కూడా వరుస సినిమాలు చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇటీవల అక్కడ దళపతి విజయ్తో కలిసి ఒక సినిమా చేసింది.

దానితోపాటు హిందీలో సైతం ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తోంది .కానీ హిందీలో మాత్రం ఈమెకి పెద్దగా కలిసి రావడం లేదు అని చెప్పాలి. ఇక అక్కడ ఆమె చేసిన సినిమాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా రష్మి ఖా తన అసిస్టెంట్ పెళ్లికి వెళ్లడం జరిగింది. రష్మిక రావడంతో ఆనందపడ్డ ఆ దంపతులు రష్మిక కాళ్ళను నమస్కరించారు. తాజాగా ఇప్పుడు ఆమె కట్టుకున్న చీర ధర సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ గా మారింది .అయితే తాజాగా సమాచారం మేరకు రష్మిక మందన కట్టుకున్న ఆ చీర ధర సుమారుగా 35 వేలకు పైగానే ఉంటుంది అన్న టాక్ వినబడుతోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: