ఒకవైపు స్టార్ హీరోల సరసన నటిస్తూనే మరోవైపు మీడియం రేంజ్ సినిమాలకి కూడా ఓకే చేస్తోంది లేడీ సూపర్ స్టార్ నయనతార. అన్ని జాలర్లను అన్ని బడ్జెట్లను కవర్ చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఆమెమ్ ఇక జవాన్ సినిమా కోసం ఆమె అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారుమ్ నార్త్ లో ఈమె అందుకోబోయే సక్సెస్ గురించి ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక అదే తరహాలో ఆమె నటన ఎలా ఉంటుంది అన్నది ఉత్తరాది ప్రేక్షకులు సైతం ఈ సినిమాను చూడడానికి సిద్ధంగా ఉన్నారు. డెబ్యూ సినిమాతోనే భారీ క్రేజ్ తెచ్చుకుంది నాయనతార.

ప్రస్తుతం ఒకవైపు స్టార్ హీరోల సినిమాల్లో చేస్తూనే మీడియమ్ రేంజ్ హీరో సినిమాల్లో కూడా చేస్తూ బిజీగా ఉంది. ఇక ఇదే ఆమె స్టైల్ అయితే ఈ విషయంలో ఆమెతో పోటీ పడుతున్న వారు లేరు అని అంటున్నారు కోలీవుడ్.  త్వరలోనే లోకేష్ తో ఒక సినిమా చేయడానికి కూడా నయనతార గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం లియో సినిమాతో బిజీగా ఉన్న లోకేష్ దర్శకత్వం వహించే సినిమాలో లారెన్స్ హీరోగా నటిస్తున్నారు.  ఒక ప్రస్తుతం చంద్రముఖి 2 సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు లారెన్స్. ఇక ఈ సినిమా పూర్తి కాగానే లోకేష్ లోకి వెళ్లబోతున్నట్లుగా సమాచారం వినబడుతోంది.

 ఇంపాక్ట్ ఉన్న కథతో తక్కువ వర్కింగ్ డేస్ లో తెరకెక్కించడానికి  వీళ్ళందరూ రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం నయనతార కూడా ఖాళీగా లేదు. సెట్స్  మీద మరో రెండు లేడీ ఓరియంటెడ్ సినిమాలతో బిజీ కాబోతోంది నయనతార. మణిరత్నం కమలహాసన్ కాంబినేషన్లో వచ్చే సినిమాల్లోనూ హీరోయిన్గా నయనతార నటిస్తుంది అన్న సమాచారం వినబడుతోంది. ఎంత బిజీగా ఉన్నప్పటికీ పర్సనల్ లైఫ్ లో పాటించవలసిన అన్ని పద్ధతులను పాటిస్తూ పర్సనల్ లైఫ్ లో కూడా బిజీగా ఉంది. ఇద్దరి కొడుకులతో ఎంతో సంతోషంగా గడుపుతోంది నయనతార. ఇటీవల ఇంస్టాగ్రామ్ లోకి ఎంటర్ ఇచ్చిన ఆమె కొద్ది సమయంలోనే మిలియన్ల ఫాలోవర్స్ ని దక్కించుకుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: