టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మిడిల్ రేంజ్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు గోపీచంద్. ఇక ప్రేక్షకుల్లో ఆయనకి ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే ఈ మధ్యకాలంలో గోపీచంద్ నటించిన సినిమాల్లో మెజారిటీ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యాయి అని చెప్పాలి. రామబాణం సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకి వచ్చిన గోపీచంద్ కి భారీ షాక్ తగిలింది. ప్రముఖ ఓటీటీలలో ఒకటైన నైట్ ఫ్లెక్స్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతోంది .అయితే ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. ఇక విడుదలైన చాలా నెలల తరువాత రామబాణం

 సినిమా ఓటిటిలో విడుదల కావడంతో గోపీచంద్ అభిమానులు సంతోషిస్తున్నారు. కాగా ఈనెల 14వ తేదీన ఈ సినిమా తెలుగులోనే కాకుండా తమిళ కన్నడ మలయాళం వంటి భాషల్లో స్ట్రీమింగ్ కావడానికి సిద్ధంగా ఉంది. అయితే రామబాణం సినిమా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై తెరకెక్కగా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించలేకపోయింది ఈ సినిమా. శ్రీవాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా చాలా రొటీన్ కథతో రావడంతో ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోవడంలో విఫలమైంది. కాగా రామబాణం సినిమా మంచి ఫలితాన్ని సొంతం చేసుకోకపోవడంతో

 శ్రీ వాస్కు కొత్త సినిమా ఆఫర్లు రావడం తగ్గాయి అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక గోపీచంద్ విషయానికి వస్తే పలు క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు ఆయన. గోపీచంద్ శ్రీనువైట్ల కాంబినేషన్లో ఒక సినిమా త్వరలోనే రాబోతుంది అన్న సమాచారం వినబడుతోంది. ఇక ప్రస్తుతం సక్సెస్ ట్రాక్ లోకి రావాలని కోరుకుంటున్నారు ఆయన అభిమానులు. ఇక కథ అద్భుతంగా ఉంటే మల్టీ స్టార్స్ అనిమలకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి అని కోరుకుంటున్నారు ఆయన అభిమానులు. దీంతో గోపీచంద్ కి సంబంధించిన ఈ వార్త కాస్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: