ముఖ్యంగా గౌతం కృష్ణ శుభ శ్రీ మీద స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆమె కూడా హౌజ్ లో ఎక్కువసేపు అతనితోనే స్పెండ్ చేస్తుంది. బిగ్ బాస్ లో ప్రేమ జంటలు ఏర్పడటం ఇదేమి కొత్త కాదు. ఆల్రెడీ బయట రిలేషన్ షిప్ ఉన్న వారు కూడా ఇక్కడ తమకు బాగా కనెక్ట్ అయిన వారితో ఎమోషనల్ బాండింగ్ ఏర్పరచుకుంటారు. బిగ్ బాస్ సీజన్ 7 లో గౌతం కృష్ణ శుభ శ్రీలు కూడా అలానే వారి లవ్ స్టోరీని కొనసాగించేలా ఉన్నారు. మొదటి వారమే వీరిద్దరు క్లోజ్ అవగా వారాలు గడుస్తున్నా కొద్దీ ఈ ఇద్దరు ఎలాంటి బాండింగ్ ఏర్పరచుకుంటారన్నది చూడాలి.
ఇక మరోపక్క పల్లవి ప్రశాంత్ కూడా రతిక మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఆమె అంటే ఇష్టం అన్నట్టుగా ఉన్నాడు. రతిక కూడా ఆట కోసమో లేదా మరో కారణమో తెలియదు కానీ పల్లవి ప్రశాంత్ తో క్లోజ్ గా ఉంటుంది. మరి ఈ లవ్ స్టోరీస్ సీజన్ ని ఎలా ముందుకు తీసుకెళ్తాయన్నది చూడాలి. సీజన్ 7 ఫస్ట్ వీక్ ఆడియన్స్ ని బాగానే ఎంటర్టైన్ చేసిందని చెప్పొచ్చు.