బాయ్స్ సినిమాతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమైన నటి జెనీలియా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆ సినిమా తర్వాత ఆ తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించి హీరోయిన్గా మంచి గుర్తింపును సంపాదించుకుంది. అనంతరం బొమ్మరిల్లు సినిమాతో స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ఇక ఆ సినిమా తర్వాత జెనీలియా కాస్త హాసినిగా అందరికీ గుర్తుండిపోయింది. తెలుగులో చాలామంది స్టార్ హీరోల సరసన నటించి ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఆమె బాలీవుడ్ నటుడిని వివాహం చేసుకుంది. బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నటుడిగా కొనసాగుతున్న రిషితేష్ దేశముఖ్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది జెనీలియా.

పెళ్లి తరువాత చాలా కాలం సినిమాలకు దూరంగా ఉంది. ఇక అలా సినీ ఇండస్ట్రీకి దూరమైన ఆమె ఇద్దరు పిల్లలకు తల్లిగా మారిపోయింది. పిల్లలు పెరిగి పెద్దయిన తర్వాత తిరిగి సెకండ్ ఇన్నింగ్స్ ని సైతం ప్రారంభించింది.  ప్రస్తుతం పలు సినిమాలు వెబ్ సిరీస్ చేస్తూ బిజీగా మారింది. ఈ నేపథ్యంలోనే జెనీలియాకి సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అయితే తాజాగా జెనీలియా మరియు ఆమె భర్తతో కలిసి ఒక ప్రైవేటు ఫంక్షన్కు హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే ఈ ఫంక్షన్ కి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో అవుతున్నాయి.

అయితే ఆ ఫోటోలలో జెనీలియా బ్లూ కలర్ డ్రెస్ లో చాలా గ్లామరస్ గా ఆకట్టుకుంది. అయితే ఈ ఫోటోలలో జెనీలియా ని పర్టిక్యులర్ గా బేబీ బంప్ తో కనిపిస్తోంది. దీంతో ఈ ఫోటోలను చూసిన వారందరూ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఇప్పటికే ఇద్దరు పిల్లలకు తల్లిగా ఉన్నటువంటి జెనీలియా ఇప్పుడు మూడోసారి తల్లి కాబోతుందా అన్న సందేహాలు నెలకొన్నాయి. ఇక ఈ బ్లూ కలర్ డ్రెస్ లో తన బేబీ బంప్ తో కాస్త ఇబ్బందికరంగానే కనిపించింది జెనీలియా. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండడంతో జెనీలియా మూడోసారి తల్లి కాబోతుంది అంటూ  ప్రచారం చేస్తున్నారు. ఇక ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలి అంటే జెనీలియా స్పందించాల్సి ఉంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: