బాలీవుడ్ లో 'ధూమ్' సిరీస్ కి ఎలాంటి క్రేజ్ ఉందో తెలిసిందే. ఇప్పటివరకు 'ధూమ్' ఫ్రాంచైజీ నుండి మూడు సిరీస్ లు వచ్చాయి.  2004లో హృతిక్ రోషన్, ఐశ్వర్యరాయ్ లీడ్ రోల్స్ ప్లే చేసిన 'ధూమ్2' ఈ ఫ్రాంచైజీలో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక సినిమాలో హృతిక్ రోషన్ స్టైల్, స్వాగ్ అలాగే ఐశ్వర్యరాయ్, హృతిక్ ల మధ్య రొమాంటిక్ సీన్స్ ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా సినిమాలో హృతిక్ - ఐశ్వర్యరాయ్ మధ్య వచ్చే లిప్ లాక్ సీన్ అప్పట్లో ఎంత పెద్ద హాట్ టాపిక్ అయిందో తెలిసిందే. ఈ సీన్ చేయడంపై ఐశ్వర్యరాయ్ పై అప్పట్లో ఎన్నో విమర్శలు కూడా వచ్చాయి. నిజానికి సినిమాల్లో అలాంటి సీన్స్ చేయడం తనకు అంత కంఫర్ట్ గా ఉండదని ఇటీవల ఓ సందర్భంలో చెప్పింది ఐశ్వర్యరాయ్. 

ఇదిలా ఉంటే 2012లో ఓ బాలీవుడ్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఐశ్వర్య రాయ్ 'ధూమ్2' సినిమాలో హృతిక్ రోషన్ తో చేసిన లిప్ లాక్ సీన్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. 'ధూమ్2' సినిమాలో నేను ఒక్కసారి మాత్రమే హృతిక్ రోషన్ తో లిప్ లాక్ సీన్ చేశాను. కానీ ఆ తర్వాత నాకు కొంతమంది దగ్గర్నుంచి లీగల్ నోటీసులు వచ్చాయి. "మీరు ఒక ఐకానిక్ ఉమెన్. ఎంతో మంది ఆడపిల్లలకి మీరు ఒక ఆదర్శం. అలాంటిది మీరు సినిమాల్లో ఇలా ముద్దు సన్నివేశాల్లో నటించడం ఏమాత్రం బాలేదు. మీరు ఇలాంటి సీన్స్ ఎందుకు చేశారు?" అని చాలామంది నన్ను అడిగారు. "అలాంటి కామెంట్స్ చూసి నేను ముందు ఆశ్చర్యపోయా. నేను ఓ యాక్టర్ ని. 

 నిజానికి అదే సమయంలో హాలీవుడ్ నుంచి యూరోపియన్ సినిమాస్, ఇంగ్లీష్ మూవీ మేకర్స్ కి నాపై ఎంతో ఆసక్తి ఉంది. నేను కూడా రొమాంటిక్ సీన్స్, కిస్ సీన్స్ చేయడం నచ్చక కొన్ని హాలీవుడ్ లో కొన్ని స్క్రిప్ట్స్ ని రిజెక్ట్ చేశాను. ఎందుకంటే నాకు అలాంటి సన్నివేశాలు చేయడం కంఫర్టబుల్గా అనిపించదు" అని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా.." నేను వెండితెరపై అలాంటి సన్నివేశాల్లో నటించడం నాతోపాటు నా అభిమానులకు కూడా ఇష్టం లేదు. అలాగే ప్రేక్షకులకు కూడా నేను స్క్రీన్ పై అలాంటి సన్నివేశాలు చేయడం నచ్చదని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నేను ఇలాంటి సన్నివేశాలు చేయాల్సి వస్తే అది మన ఇండియన్ సినిమాలోనే చేస్తాను అని ఐశ్వర్య రాయ్ తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: