బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఏకంగా పాన్ ఇండియా రేంజ్ హీరోగా మారిపోయాడు. అప్పటివరకు కేవలం తెలుగు ప్రేక్షకులకు మాత్రమే డార్లింగ్ గా కొనసాగిన ప్రభాస్.. అటు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోని ప్రతి ప్రేక్షకుడికి కూడా డార్లింగ్ గా మారిపోయాడు అనే విషయం తెలిసిందే. అయితే బాహుబలి తర్వాత అన్ని భారీ బడ్జెట్ సినిమాలే చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నాడు. ఇక ప్రభాస్ సినిమాలు పెద్దగా హిట్ కాకపోయినా వసూళ్ల విషయంలో మాత్రం ఎన్నో రికార్డులు కొల్లగొడుతున్నారు అని చెప్పాలి.


 ఇక ఇప్పుడు ప్రభాస్ నటించిన సలార్ సినిమా విడుదలకు సిద్ధమవగా.. ఇక కల్కి, స్పిరిట్ లాంటి సినిమాలతో బిజీబిజీగా ఉన్నాడు అని చెప్పాలి  ఇలాంటి సమయంలోనే ప్రభాస్ ఏకంగా భక్తకన్నప్ప పాత్ర లో నటించబోతున్నాడు అంటూ ఒక వార్తా సోషల్ మీడియా లో వైరల్ గా మారిపోయింది. అది కూడా మంచువారి సినిమా లో ఒక స్పెషల్ రోల్ చేయబోతున్నాడు అన్న వార్త అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఏకంగా ఈ సినిమాలో పది నిమిషాలు నడివి ఉన్న  పాత్రలో ప్రభాస్ కనిపించబోతున్నాడట.


 ఈ క్రమంలోనే ఈ చిన్న పాత్ర చేసేందుకు ప్రభాస్ ఎంత పారితోషకం తీసుకున్నాడు అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ప్రస్తుతం ఒక్కో సినిమాకి 100 నుంచి 150 కోట్లు తీసుకుంటున్నాడు ప్రభాస్. కానీ భక్తకన్నప్ప పాత్ర తన పెదనాన్న కృష్ణంరాజుకు ఇష్టమైన రోల్ కావడం.. మంచు ఫ్యామిలీతో మంచి సంబంధాలు ఉన్న నేపథ్యంలో ప్రభాస్ తనకు పారితోషకం వద్దని చెప్పాడట. ఇక ఈ సినిమా షూటింగ్ కోసం రెండు రోజులు టైం కేటాయించబోతున్నాడట ప్రభాస్. కాగా భక్తకన్నప్ప మూవీ ఏకంగా 150 కోట్ల  బడ్జెట్తో తెరకేక్కుతుంది. అయితే ప్రభాస్ నటించటం ఈ మూవీకి ఎంతగానో ప్లస్ కానుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: