మలయాళం ముద్దుగుమ్మ మాళవిక మోహన్ రజనీకాంత్ తో కలిసి మొదట పేట అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చి అందరిని ఆకట్టుకుంది.ఆ తర్వాత విజయ్ దళపతి సరసన మాస్టర్ అనే సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలు అయ్యింది. ఈ సినిమా తర్వాత ఈమె తెలుగులో కూడా ఆఫర్లు వెలుపడ్డాయి..ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న రాజా డీలక్స్ అనే పాన్ ఇండియా చిత్రంలో ఈమె హీరోయిన్గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. అయితే ఈ సినిమా టైటిల్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు



ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ నటిస్తున్నట్లుగా తెలుస్తోంది అందులో మాళవిక మోహన్ ఒకరు కాగా మరొకరు నిధి అగర్వాల్ అన్నట్లుగా సమాచారం. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే కొన్ని యాక్షన్స్ సన్నివేశాలు కూడా షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపుగా నెల రోజులపాటు ఫారెన్ లో షూటింగ్ చేసిన మళ్లీ ఇండియాకి వచ్చేలా కనపడడం లేదు . దీంతో ప్రభాస్ లేకుండానే ఈ సినిమా షూటింగ్ తెరకెక్కిస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకు సంబంధించిన కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ఈ వీడియోలో హీరోయిన్ మాళవిక స్టంట్ చేస్తూ ఉన్నటువంటి ఒక వీడియో లీవ్ కావడం జరిగింది..ప్రభాస్ లేకపోయినా సరే సినిమా షూటింగ్ ఆపేది లేదు అనే అంతగా డైరెక్టర్ మారుతి ప్లాన్ చేస్తూ ఇలా ప్రభాస్ సన్నివేశాలు కాకుండా ఇతర సన్నివేశాలను షూటింగ్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు.. మాళవిక విలన్సుతో ఫైటింగ్ చేస్తున్నటువంటి ఒక వీడియో అభిమానులను సైతం బాగా ఆకట్టుకునేలా కనిపిస్తోంది రొమాంటిక్ సీన్లలోనే కాకుండా ఇలా యాక్షన్ సీన్లలో కూడా అదరగొట్టేస్తోంది మాళవిక. ఇందులో ప్రభాస్ చాలా కొత్తగా కనిపించబోతున్నారని సమాచారం. ఈ సినిమా హర్రర్ కామెడీ జోనర్లు తెరకెక్కిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ లీకైన వీడియో వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: