కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ కు తమిళ్ తో పాటు మన తెలుగులో కూడా భారీ ఫాలోయింగ్ ఉంది. అందుకే ఈ స్టార్ హీరో సినిమాలను తెలుగులో కూడా భారీ స్థాయిలో విడుదల చేస్తారు.ఆ సినిమా కు మంచి టాక్ వస్తే కనుక తెలుగులో  భారీ కలెక్షన్స్ వస్తాయి. ఈ సంవత్సరం వారిసు సినిమాతో విజయం సాధించిన విజయ్ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు..విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ లియో..వారిసు సినిమాతో సంక్రాంతి కి మంచి హిట్ అందుకున్న విజయ్ ఈసారి దసరా బరిలో కూడా నిలవబోతున్నాడు. దళపతి విజయ్ నటిస్తున్న లియో సినిమాను సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్  తెరకెక్కిస్తున్నారు... భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా తమిళ్ ఇండస్ట్రీలో క్రేజీ ప్రాజెక్ట్ లలో ఒకటిగా రూపొందుతుంది.ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోగా ఈ సినిమా నుండి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది దీనితో ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి.

సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19 న భారీ స్థాయిలో విడుదల కాబోతుంది.. తాజాగా ఈ సినిమా ఐమాక్స్ వర్షన్ గురించి మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాను యూఎస్ డిస్టిబ్యూటర్స్ అక్కడ ఐమాక్స్ ఫార్మాట్ లో విడుదల చేస్తున్నట్టు తెలిపారు..మరి మన ఇండియాలో కూడా ఐమాక్స్ ఫార్మాట్ లోనే రిలీజ్ చేస్తారో లేదో మరి క్లారిటీ రావాల్సి ఉంది.   ఇదిలా ఉండగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మలేషియాలో ఎంతో గ్రాండ్ గా చేయబోతున్నారు అని సమాచారం... అక్టోబర్ 14న ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడ గ్రాండ్ గా జరగబోతుండగా టీమ్ అంతా ఈ ఈవెంట్ లో పాల్గొననుంది. ఈ సినిమాను సెవన్ స్క్రీన్ స్టూడియో పై లలిత్ కుమార్  భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: