బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ఇటివల నటించిన జవాన్ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సెప్టెంబర్ 7 న విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. హిందీలోనే కాకుండా తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషల్లో విడుదలైన ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతోంది. మొత్తం పది రోజులకి కలిపి ప్రపంచవ్యాప్తంగా 797.50 కోట్లను వసూలు చేసి భారీ షాక్ ఇచ్చింది. ఇక ఈ విషయాన్ని జవాన్ నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో నయనతార హీరోయిన్గా నటించి

 ప్రియమణి విజయ్ సేతుపతి సానియా మల్హోత్రా సునీల్ యోగిబాబు తదితరులు ప్రధాన పాత్రలో మెరిసారు. షారుఖాన్ సొంత బ్యానర్ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై గౌరీ ఖాన్ ఈ సినిమాను నిర్మించారు. అనిరుద్ధ స్వరగాలు అందించిన ఈ సినిమా థియేటర్లో సందడి చేస్తూనే ఓటిటి రిలీజ్ గురించి కూడా ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. అయితే తాజాగా ఈ విషయంపై డైరెక్టర్ స్పందించారు. షారుఖ్ అభిమానులకి మరొక గుడ్ న్యూస్ చెప్పారు.“ సరైన రన్ టైం ఎమోషనల్ సన్నివేశాలతో జవాన్ సినిమాని థియేటర్స్ లో విడుదల చేసాం..

ఇక ఓటిటి రిలీజ్ కు వచ్చేసరికి ఇంకొన్ని సీన్లు యాడ్ చేయాలి అని భావిస్తున్నాము.. అందుకే హాలిడే కు వెళ్లకుండా ఇప్పుడు దీనిపైనే వర్క్ చేస్తున్నాను ఓటిటి లో జవాన్ కచ్చితంగా మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తుంది..” అంటూ చెప్పకు వచ్చాడు డైరెక్టర్ అట్లీ. దీంతో ఈ సినిమా ఓటిటి రిలీజ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఇక జవాన్ ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడు అన్నదానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు డైరెక్టర్. కాగా జవాన్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫారం నెట్ఫ్లిక్స్ భారీ ధర కి కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. సుమారు 250 కోట్లు పెట్టి మరి ఈ సినిమాని కొనుగోలు చేసింది. నవంబర్ మొదటివారం లో ఈ సినిమా స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: