టాలీవుడ్ యంగ్ హీరో ఎనర్జెటిక్ హీరో రామ్ పోతినేని నటిస్తున్న తాజా మూవీ స్కంద. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఇది. బోయపాటి అఖండ సినిమా తర్వాత తీస్తున్న సినిమా కావడంతో, ఈ మూవీ పై ఎక్కువ అంచనాలు ఉన్నాయి.భారీ బడ్జెట్ తో ఈ మూవీని తెరకెక్కించారు. నిజానికి ఈ పాటికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ, కొన్ని కారణాల వల్ల సినిమా వాయిదా పడింది. సెప్టెంబర్ 28వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సినిమా విడుదల దగ్గరపడుతుండటంతో, ప్రమోషన్స్ హీట్ పెంచారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు, మూడు పాటలు విడుదల చేశారు. కాగా, తాజాగా మరో ఐటెం సాంగ్ ని కూడా విడుదల చేశారు. టాలీవుడ్ లో ఉన్న బెస్ట్ డ్యాన్సర్లలో ఖచ్చితంగా రామ్ పోతినేని కూడా ఒకరు. రామ్ తో మ్యాచ్ అయ్యేలా డ్యాన్స్ చేయాలంటే హీరోయిన్లకు అంత ఈజీ ఏమీ కాదు. అయితే, ఈ స్కంద మూవీలో ఇప్పటికే శ్రీలీల తాను మ్యాచ్ చేయగలను అని ఆమె నిరూపించింది. 


తాజాగా ఐటెం సాంగ్ లో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతెలా కూడా తన డ్యాన్సింగ్ టాలెంట్ ఏంటో చూపించింది.తాజాగా, ఈ సాంగ్ ని విడుదల చేశారు. ఇక ఈ పాట ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. కల్ట్ మామ అంటూ సాగే ఈ మాస్ పాట రామ్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించేలా ఉంది. ఊర్వశి రౌతెలా రామ్ తో గట్టిగా పోటీపడుతూ డ్యాన్స్ వేసింది. ఎస్ ఎస్ థమన్ మ్యూజిక్ తో మ్యాజిక్ చేశాడనే విషయం స్పష్టంగా అర్థమౌతోంది. ఫుల్ ఎనర్జీ తో సాగే పాట ఇది. అభిమానులకు అయితే ఇదొక సూపర్ విజువల్ ట్రీట్ లా ఉండటం విశేషం.ఇక ఈ పాటను, ప్రముఖ లిరిక్ రైటర్ అనంత శ్రీరామ్ రాయడం విశేషం. ఈ పాటను హేమ చంద్ర, రమ్య బెహెరా కలిసి ఆలపించారు. భారీ సెట్‌లో ఈ పాటను షూట్ చేసినట్లు తెలుస్తోంది. ఇక రామ్ రెండు డిఫరెంట్ లుక్స్ లో కనిపించడం విశేషం. ఇప్పటికే, విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.ఇప్పుడు ఈ పాట కూడా ఊర మాస్ గా చాలా బాగా ఆకట్టుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: