నాగచైతన్య హీరోగా నటించిన మొదటి చిత్రం జోష్ ఇందులో నటించిన నటి శ్రేయా ధన్వంతరి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.. అచ్చ తెలుగు అమ్మాయిగా కనిపించే ఈ ముద్దుగుమ్మ గొప్పనటిగా కూడా పేరు పొందింది. ఆ తర్వాత స్నేహ గీతం అనే సినిమాలో కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత అవకాశాలు రాలేకపోవడంతో బాలీవుడ్ కి షిఫ్ట్ అయ్యి అక్కడ పలు సినిమాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ లో కూడా ఒక కీలకమైన పాత్రలో నటించింది శ్రేయా ధన్వంతరి అలాగే పలు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తున్నట్టు సమాచారం.

సోషల్ మీడియాలో తరచు యాక్టివ్గా ఉన్నా ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాళ్లకు అందాల విందు చేస్తూ ఉంటుంది. ట్రెండ్ కు తగ్గట్టుగా దుస్తులను ధరించి మరి అందాల విందు చేస్తూ ఉంటుంది. తాజాగా లెహంగాలో తన అందాలను చూపిస్తూ మైమరిపించేలా చేస్తోంది. ఆరంజ్ కలర్ లెహంగాలు మెరిసిపోతూ మోడ్రన్ దుస్తులలో కంటే ఎక్కువ అందాలను చూపిస్తోంది శ్రేయా ధన్వాంతరి. తన నడుము అందాలతో పాటు ఎలా అందాలతో క్లీవెన్స్ సొగసులతో కుర్రాళ్ళ మైండ్ బ్లాక్ చేసే విధంగా చేస్తోంది.

ప్రస్తుతం ఈ ఫోటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు  నేటీజన్స్ సైతం అందానికి ఎవరైనా కాంప్లిమెంట్ ఇవ్వాల్సిందే అన్నట్టుగా కామెంట్స్ చేస్తున్నారు. హైదరాబాద్ ప్రాంతానికి చెందిన అమ్మాయి అయినప్పటికీ పెరిగింది ఢిల్లీలో.. వరంగల్లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన శ్రేయ మొదటి నుంచి గ్లామర్ ఫీల్డ్ మీద ఎక్కువ ఆసక్తి ఉండడంతో ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలోనే మోడలింగ్ వైపుగా అడుగులు వేసింది. ఫెమీనా మిస్ ఇండియా సౌత్ 2008లో పోటీ చేసినట్లు తెలుస్తోంది అప్పుడు ఈమె రన్నర్ గా గెలిచినట్లు సమాచారం. ప్రస్తుతం శ్రేయా ధన్వంతరి ఫోటోలు సోషల్ మీడియాలో హీటెక్కించే విధంగా కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: