టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణ గత కొన్నేళ్లుగా వరుస విజయాలతో సత్తా చాటుతున్నారు. అఖండ, వీరసింహారెడ్డి సినిమా లతో విజయాలను సొంతం చేసుకున్న బాలయ్య సినిమాలలో బాలయ్యకు జోడీగా నటించిన హీరోయిన్లకు ఆశించిన స్థాయిలో ఆఫర్లు రావడం లేదు.బాలయ్య రూలర్ సినిమాలో సోనాల్ చౌహాన్, వేదిక అఖండ సినిమా లో ప్రగ్యా జైస్వాల్, పూర్ణ వీరసింహారెడ్డి సినిమాలో శృతి హాసన్, హనీరోజ్ హీరోయిన్లు గా నటించగా వీళ్లెవరూ ప్రస్తుతం ఆఫర్ల తో బిజీగా లేరు.ఈ విషయం తెలిసి బాలయ్య హీరోయిన్లకు ఇలాంటి స్థితా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. బాలయ్య హీరోయిన్లు కెరీర్ ను సరిగ్గా ప్లాన్ చేసుకోవడం లో ఫెయిల్ అవుతున్నారని అందుకే ఈ పరిస్థితి అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బాలయ్య తో నటించిన హీరోయిన్లలో చాలామంది హీరోయిన్లు గతంలో వరుస ఆఫర్లతో బిజీ అయ్యారని ఇప్పుడు మాత్రమే ఇలా జరుగుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
 
బాలయ్య  భగవంత్ కేసరి సినిమా లో కాజల్ హీరోయిన్ గా నటించగా కాజల్ సైతం ఈ సినిమా పై చాలా ఆశలు పెట్టుకున్నారు. కాజల్ కు ఈ సినిమా తర్వాత ఆఫర్లు పెరుగుతాయో లేదో చూడాల్సి ఉంది. కాజల్సినిమా కు 2.5 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. భగవంత్ కేసరి సినిమా ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా ఈ సినిమాకు బిజినెస్ సైతం భారీ రేంజ్ లో జరుగుతోందిఅక్టోబర్ నెల 19వ తేదీన ఈ సినిమా థియేటర్ల లో రిలీజ్ కానుంది. ఈ సినిమా విడుదలకు సరిగ్గా నెల రోజుల సమయం మాత్రమే ఉంది. బాలయ్య భగవంత్ కేసరి సినిమాలో కామెడీ సీన్లతో పాటు యాక్షన్ సీన్లు ఉన్నాయని సమాచారం అందుతోంది. బాలయ్య రాబోయే రోజుల్లో భవిష్యత్తు సినిమాలతో మరిన్ని రికార్డులను క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: