హీరోయిన్ గా బోల్డ్ బ్యూటీగా పేరు పొందింది హీరోయిన్ అమీ జాక్సన్.. ఈ అమ్మడు మొదట మద్రాసుపట్నం అనే తెలుగు సినిమాతో ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఐ , ఎవడు వంటి చిత్రాలతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ వివాహం కాకముందే ఒక బిడ్డకు తల్లి అయి అందరికీ షాక్ ఇచ్చింది. బాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటించిన అమీ జాక్సన్ అక్కడ తన గ్లామర్ తో కుర్రాళ్లను తన వైపు తిప్పుకునేలా చేసింది. నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు రకాల గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూనే ఉంటుంది.

ప్రతి సినిమాకు కూడా తన లుక్ ని మారుస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది అమీ జాక్సన్. తాజాగా ఇప్పుడు సరికొత్త లుక్ లో అమీ జాక్సన్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ ఫోటోలు చూసిన పలువురు నెట్టిజన్స్ సైతం అమీ జాక్సన్ అని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ ఫోటోలలో అమీ జాక్సన్ మరింత దారుణంగా కనిపిస్తూ కాస్త భయభ్రాంతులకు గురయ్యేలా కూడా చేస్తోందని చెప్పవచ్చు. ఈ ఫోటోలు చూసిన తర్వాత అమీ జాక్సన్ కు ఏదైనా వ్యాధి సోకింద లేకపోతే సినిమా కోసం ఇలా రెడీ అయిందా అనే విషయంపై అభిమానులు సందిగ్ధతతో ఉన్నారు.


మరి కొంతమంది నెటిజన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తూ ఐ సినిమాలో విక్రమ్ మోసం చేసినందుకు ఇలా పగ తీర్చుకున్నారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఈ లుక్కులో మాత్రం అమీ జాక్సన్ చాలా దారుణంగా ఉందంటూ అభిమానులకు నచ్చలేదంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. అమీ జాక్సన్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం తమిళంలో ఒక సినిమాలో నటిస్తున్నట్టు సమాచారం. గత కొన్నేళ్లుగా ఈ అమ్మడు సినిమాలకు దూరంగా ఉంటూ తన బిడ్డతో పలు రకాల వెకేషన్కు వెళ్తూ పలు రకాల ఫోటోలను షేర్ చేయడం జరిగింది ఇప్పుడు తాజాగా ఇలాంటి లుక్ లో అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: