బుల్లితెర యాంకర్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న అనసూయ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బుల్లితెరపై యాంకర్ గా కొనసాగుతునే వెండితెరపై వరుస సినిమాల అవకాశాలు రావడంతో బుల్లితెరకి దూరమైంది ఈ అందాల తార. వెండితెర సినిమాలలో నటిస్తూ సక్సెస్ రావడంతో టివి కార్యక్రమాలకు దూరమైంది. ప్రస్తుతం కేవలం సినిమాల్లోని నటిస్తూ బిజీగా ఉంది. అయితే తాజాగా అనసూయ నటించిన పెదకాపూ సినిమా సెప్టెంబర్ 29 నా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. అయితే ఈ సందర్భంగా అనసూయ పలు ఇంటర్వ్యూలు ఇస్తుంది. 

ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నా ఆమె తన భర్త గురించి ఎవరికీ తెలియని విషయాలను పంచుకుంది. వీరిద్దరిది ప్రేమ వివాహం అని ఈ దంపుతులకు ఇద్దరు కుమారులు సైతం అన్నారు అని చాలామందికి తెలిసి ఉంటుంది. అనసూయకు ఏమాత్రం షూటింగ్ సమయంలో విరామం దొరికిన కూడా తను కుటుంబంతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇక అనసూయ భర్త బీహార్ కి చెందిన వ్యక్తి. తనతో దాదాపుగా ఎనిమిది సంవత్సరాలు పాటు ప్రేమలో ఉండడమే కాకుండా సహజీవనం కూడా చేసాము అని ఇంటర్వ్యూలో భాగంగా చెప్పింది అనసూయ.

తనతో సహజీవనం చేస్తున్నప్పుడు కూడా మీ కులం ఏంటి అని నేను ఎప్పుడూ తనని అడగలేదు అంటూ వెల్లడించింది. అలా ఎనిమిదేళ్లపాటు సహజీవనం చేసిన తర్వాత తన తండ్రితో గొడవపడి మరి పెళ్లి చేసుకున్నాము అంటూ చెప్పుకు వచ్చింది. పెళ్లి పత్రికల్లో తన కులం ఏంటి అని అడిగినంతవరకు అసలు నా భర్త కులం ఏంటి అన్నది కూడా నాకు తెలియదు అంటూ ఈ సందర్భంగా పేర్కొంది. అలా ప్రస్తుతం అనసూయ చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదిక వైరల్ అవుతున్నాయి. ఇక సినిమాలో టీవీ షో ల గురించి సైతం మాట్లాడుతూ  టీవీ షో లు చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని త్వరలోనే టీవీ షోస్ ద్వారా కూడా ఎంట్రీ ఇస్తున్నాను అంటూ తెలియజేసింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: