రెగ్యులర్గా మూవీ పోస్టర్ రిలీజ్ చేస్తూ.. సినిమాపై అంచనాలు పెంచే ప్రయత్నం చేస్తున్నారు లోకేష్ కనగరాజు. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా రన్ టైమ్ పై ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీలో ఇంట్రెస్టింగ్ గా ప్రచారం సాగుతోంది. సినిమా రన్ టైం విషయంలో డైరెక్టర్ ఖైదీని ఫాలో అవుతున్నారని, ఈ సినిమా స్క్రీన్ ప్లే చాలా పర్ఫెక్ట్ గా ఉంటుందని, ఎక్కడా కూడా డీవియేషన్ లేకుండా చెప్పాలనుకున్న పాయింట్ ను స్ట్రైట్ గా చెప్పే ప్రయత్నం చేశారు అని సమాచారం. ముఖ్యంగా ఈ పాయింట్సే ఖైదీ సినిమాకి సూపర్ హిట్ విజయాన్ని అందించడానికి మొదటి పాత్ర వహించాయి.
ఈ క్రమంలోనే ఇప్పుడు లియో విషయంలో కూడా ఈ పాయింట్స్ ని లోకేష్ కనకరాజు ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం లియో సినిమాను 159 నిమిషాల రన్ టైంలోనే ఫైనల్ అవుట్ పుట్ సిద్ధం చేస్తున్నారట. ఇప్పటికే రన్ టైం కూడా లాక్ చేసినట్లు.. వచ్చే నెల ఆరంభం నుంచి పూర్తిగా మూవీ ప్రమోషన్స్ పై దృష్టి పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఇక భారీ టార్గెట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే.