
ఇక తర్వాత ఒరిజినల్ పీసే దిగింది అంటూ ఇది ఏ తాండవం చేస్తుందో ఏమో అంటూ వడివేలు వాయిస్తో సెకండ్ ట్రైలర్ ప్రారంభమవుతుంది.. దెయ్యానికి వయసు అవుతుందా.. జుట్టు రాలుతుందా రాలేదా అంటూ రాఘవ లారెన్స్ వడివేలు చెప్పే డైలాగులు కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నది. మొదట ట్రైలర్లో చంద్రముఖి క్యారెక్టర్ పెద్దగా చూపించలేదు..కానీ తాజా ట్రైలర్లో చంద్రముఖి పాత్రను రివ్యూ చేయడం జరిగింది. మొత్తంగా ట్రైలర్తో ఆకట్టుకుంటున్న ఈ సినిమా ఏ మేరకు ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి.
తెలుగులో శ్రీలక్ష్మి మూవీస్ చిత్రాన్ని విడుదల చేయడం జరుగుతోంది. వడివేలు, శరత్ కుమార్ ,లక్ష్మీ మీనన్,రావు రమేష్ కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా 2005లో సూపర్ హిట్గా నిలిచిన చంద్రముఖి సినిమాకి సీక్వెల్ గా తేరకెక్కిస్తూ ఉన్నారు. అయితే కొంతమంది ప్రేక్షకులను మాత్రం చంద్రముఖి సినిమా లాగా అనిపించలేదని పెద్దగా ఆకట్టుకో లేదంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. గతంలో చంద్రముఖి సినిమాలో రజనీకాంత్ నటించిన పాత్రని చంద్రముఖి-2 లో రాఘవ లారెన్స్ నటిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ వైరల్ గా మారుతోంది.