బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా మారిన ఈయన ఆ తర్వాత అవకాశాలు లేక దాదాపు నాలుగు సంవత్సరాల పాటు ఇండస్ట్రీకి దూరమయ్యారు. అయితే ఈ ఏడాది పఠాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకోవడమే కాదు.. బాలీవుడ్ సినీ పరిశ్రమకు సూపర్ హిట్ విజయాన్ని కూడా అందించారు. ఈ సినిమాతో ఏకంగా రూ.1000కోట్ల మార్కును దాటిన షారుఖ్ ఖాన్ తాజాగా జవాన్ సినిమాతోనూ అదే మ్యాజిక్ రిపీట్ చేశాడు.

ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో జవాన్ సినిమా చేసి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ గా రికార్డ్ సృష్టించిన ఈ సినిమాతో వారం రోజుల్లోనే రూ .650 కోట్లు కొల్లగొట్టిన సినిమాగా రికార్డు సృష్టించిన ఈ సినిమా ఇప్పుడు రూ.1000 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. కేవలం 19 రోజుల్లోనే జవాన్ ఈ అరుదైన రికార్డును సాధించింది. ఒకే సంవత్సరం వరుసగా రెండుసార్లు ఈ అరుదైన గణిత సాధించిన హీరోగా షారుఖ్ ఖాన్ చరిత్ర సృష్టించారని చెప్పవచ్చు. కేవలం రెండు సినిమాలతోనే రెండుసార్లు రూ.1000 కోట్ల క్లబ్లో చేరిన హీరోగా షారుఖ్ ఖాన్ రికార్డు సృష్టించారు అంతేకాదు ఈ సినిమాతో రూ.1000 కోట్ల క్లబ్లో చేరిన తొలి డైరెక్టర్గా కూడా అట్లీ ఘనత సాధించడం గమనార్హం.

యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ కి జోడిగా నయనతార నటించగా , విలక్షణ నటుడు విజయ్ సేతుపతి విలన్  గా నటించారు. ఇక ఇందులో దీపికా పదుకొనే , సంజయ్ దత్,  ప్రియమణి, సానియా మల్హోత్ర,  యోగి బాబు, సునీల్ గ్రోవర్ కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్ రవిచంద్ర సంగీతం అందించిన ఈ సినిమాని రెండు చిల్లీస్ బ్యానర్ పై  గౌరీఖాన్ నిర్మించారు. ఇక ఈ సినిమా అక్టోబర్ చివరిలో లేదా నవంబర్ మొదటి వారంలో డిజిటల్ స్ట్రీమింగ్ వచ్చే అవకాశం కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: