తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ మంచి గుర్తింపును ఏర్పరచుకున్న యువ నటులలో సందీప్ కిషన్ ఒకరు. ఈ నటుడు కెరియర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ తర్వాత సినిమాల్లో హీరోగా నటించి కొన్ని విజయాలను అందుకొని హీరోగా కూడా తనకంటూ ఓ మంచి గుర్తింపును ఏర్పరచుకున్నాడు. ఇకపోతే ఈ నటుడి కెరీర్.లో వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే ఈ నటుడు కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా ఇప్పటికే తమిళ్.లో కూడా అనేక సినిమాలలో నటించాడు.

అందులో కొన్ని సినిమాలు మంచి విజయాలను కూడా సాధించడంతో ఈ నటికి కోలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపు ఏర్పడింది. ఇకపోతే ఈ మధ్య కాలంలో సందీప్ వరుసగా సినిమాల్లో నటిస్తూ వస్తున్నప్పటికీ ఏ మూవీ కూడా ఈ నటుడికి మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందించడం లేదు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ నటుడి కొత్త సినిమాకు సంబంధించిన ఓ కేజీ అప్డేట్ బయటకు వచ్చింది.

సందీప్ కిషన్ తన తదుపరి మూవీ ని ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మించబోతున్నాడు. అలాగే ఈ సినిమాకి సి వి కుమార్ అనే తమిళ దర్శకుడు దర్శకత్వం వహించబోతుండగా సంతోష్ నారాయనన్ ఈ మూవీ కి సంగీతం అందించబోతున్నాడు. ఇకపోతే ఈ మూవీ కి సంబంధించిన మరిన్ని అప్డేట్ లను మరికొన్ని రోజుల్లోనే మూవీ బృందం విడుదల చేసే అవకాశం ఉంది. ఇకపోతే ప్రస్తుతం సందీప్ , ధనుష్ హీరో గా రూపొందుతున్న కెప్టెన్ మిల్లర్ అనే తమిళ మూవీ లో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: